IND vs AUS ICC ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ బిగ్ ఫైట్

ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా

IND vs AUS ICC ODI World Cup : అహ్మ‌దాబాద్ – ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగ‌నుంది ఫైన‌ల్ మ్యాచ్. టోర్నీలో భాగంగా మొత్తం 10 జ‌ట్లు పాల్గొన్నాయి. మొత్తం 9 మ్యాచ్ లు ఆడిన భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. ఫైన‌ల్ కు చేరుకుంది. సెమీ ఫైన‌ల్ లో న్యూజిలాండ్ ను 70 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఇదే స‌మ‌యంలో టోర్నీలో రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ద‌క్షిణాఫ్రికాను 3 వికెట్ల‌తో ప‌రాజ‌యం పాలు చేసింది.

IND vs AUS ICC ODI World Cup Updates

భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. ఎయిర్ ఇండియా ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌నుంది. దేశ ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా పోరుకు సిద్ద‌మ‌య్యాయి. ఆస్ట్రేలియా 9 మ్యాచ్ ల‌కు గాను 2 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. 7 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. అనూహ్యంగా ఫైన‌ల్ కు చేరింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోంది. కోట్లాది మంది నిరీక్షిస్తున్నారు. ఇరు జ‌ట్లు గెలుపు కోసం పోరాడ‌నున్నాయి. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై బెట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. మొత్తంగా బీసీసీఐ దీనిని అద్భుతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. క‌నీసం 10 కోట్ల మందికి పైగా ఫైన‌ల్ మ్యాచ్ ను చూసే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా.

Also Read : SA vs AUS ICC ODI World Cup : ఆసిస్ ఆల్ రౌండ్ షో

Leave A Reply

Your Email Id will not be published!