IND vs AUS WTC Final : ఆస్ట్రేలియా భారీ స్కోర్
లంచ్ వరకు 7 వికెట్లకు 422 రన్స్
IND vs AUS WTC Final : పేలవమైన రోహిత్ శర్మ కెప్టెన్సీ కారణంగా ప్రత్యర్థి ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లండ్ లోని ఓవెల్ లో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్(IND vs AUS WTC Final) లో రెండో రోజు లంచ్ వరకు 7 వికెట్లు కోల్పోయి 422 రన్స్ చేసింది ఆసిస్. సిరాజ్ బౌలింగ్ లో వరుసగా బౌండరీలు బాది తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు స్టీవ్ స్మిత్. తన కెరీర్ లో ఇది 31వ సెంచరీ కావడం విశేషం.
తొలి సెషన్ లో బౌలర్లు ఆకట్టుకున్నా ఆ తర్వాత తేలి పోయారు. ప్రధానంగా ట్రావిస్ హేడ్ దంచి కొట్టాడు. అతడికి తోడుగా స్టీవ్ స్మిత్ క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇరువురు నాలుగో వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో క్వారీ 22 రన్స్ తో ఉండగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 పరుగులతో ఉన్నారు. స్మిత్ 121 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
రెండో రోజు మైదానంలోకి వచ్చిన ట్రావిస్ హెడ్ దూకుడు పెంచాడు. 163 పరుగుల వద్ద అద్బుతమైన బంతికి బోల్తా కొట్టించాడు సిరాజ్. కామెరూన్ ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు మియా. క్వారీ 8 రన్స్ చేస్తే స్టార్క్ సున్నాకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆచి తూచి ఆడుతున్నాడు. మొత్తంగా పూర్తి గా ఆస్ట్రేలియా పటిష్టమైన స్కోర్ చేసింది.
Also Read : Sourav Ganguly : రోహిత్ కెప్టెన్సీపై దాదా గుస్సా