IND vs BAN 1st ODI : అబ్బా మెహిది మిరాజ్ దెబ్బ
మెహిదీ..రెహమాన్ వీరవిహారం
IND vs BAN 1st ODI : బంగ్లా టూర్ లో భాగంగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు కోలేకోలేని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. బంగ్లా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డంగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు బౌలర్ల ధాటికి టీమిడియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
186 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం 187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్(IND vs BAN 1st ODI) ఒక్క వికెట్ తేడాతో గెలుపొంది. ఒకానొక దశలో 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న ఆ జట్టును మెహదీ , రెహమాన్ అద్భుతంగా ఆడడంతో ఘన విజయాన్ని నమదు చేసింది. మహ్మద్ సిరాజ్ , శార్దూల్ ఠాకూర్ వరుసగా ముష్పికర్ రహీమ్, మహ్మదుల్లాను అవుట్ చేయడంతో బంగ్లాదేశ్ వేగంగా రెండు వికెట్లు కోల్పోయింది.
అంతకు ముందు ఢాకా లోని షేర్ బంగగ్లా నేషనల్ స్టేడియంలో ఆదివారం భారత్ తో మూడు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి వన్డేలో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఆది లోనే నాలుగు వికెట్లు కోల్పయింది. షకీబ్ అల్ హసన్ అవుట్ కాగా సుందర్ రెండు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ , సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఇన్నింగ్స్ తొలి బంతికే నజ్ముల్ హుస్సేన్ శాంటోను చాహర్ అవుట్ చేయగా సిరాజ్ 10వ ఓవర్ లో అనముల్ హక్ ను అవుట్ చేశారు. ఆ తర్వాత లిట్టన్ దాస్ , షకీబ్ అల్ హసన్ వికెట్లను కూల్చాడు సుందర్. అంతకు ముందు భారత క్రికెటర్లు ఎవరూ ధాటిగా ఆడలేక పోయారు.
ఒక్క కేఎల్ రాహుల్ 74, రోహిత్ శర్మ 27 రన్స్ తప్పా అంతా చాప చుట్టేశారు. దీంతో ఈ విజయంతో బంగ్లాదేశ్ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read : లిట్టన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్ కోహ్లీ షాక్