IND vs BAN 2nd ODI : బంగ్లా భళా భారత్ విలవిల
రెండో వన్డేలోనూ తప్పని ఓటమి
IND vs BAN 2nd ODI : స్టార్ ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ మైదానంలోకి వచ్చే సరికల్లా చేతులెత్తేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఆడుతున్నారో తెలియడం లేదు. బంగ్లాదేశ్ టూర్ లో మూడు వన్డేల సీరీస్ ను ఆతిథ్య జట్టు 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ఇంకా మరో మ్యాచ్ ఉండగానే. ఏది ఏమైనా బంగ్లాదేశ్ అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ భారత్ కంటే అద్బుతంగా ఆడింది.
మొదటి వన్డే మ్యాచ్ లో ఒక వికెట్ తో ఓడి పోగా రెండో మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలుపు అంచుల దాకా వచ్చి బొక్క బోర్లా పడింది. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ రాణించినా ఆఖరులో రోహిత్ శర్మ సత్తా చాటినా బంగ్లా(IND vs BAN 2nd ODI) బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు టీమిండియా. ఓ వైపు గాయం బాధ పెట్టినా కెప్టెన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
విచిత్రం ఏమిటంటే తొలి వన్డేలో భారత్ కు తన అసాధారణ బ్యాటింగ్ తో చుక్కలు చూపించిన మిరాజ్ ..రెండో వన్డేలో టీమిండియా పాలిట శాపంగా మారాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకానొక దశలో 63 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో మిరాజ్ బంగ్లాదేశ్ ను గట్టెక్కించాడు. భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. ఇక ఎప్పటి లాగే శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిరాశ పరిచారు. మొత్తంగా అన్ని విభాగాలలోనూ టీమిండియా చెత్త ప్రదర్శనతో చేతులెత్తేసింది.
Also Read : భారత్ పరాజయం బీసీసీఐపై ఆగ్రహం