IND vs BAN 2nd Test 2022 : రాణించిన పంత్..అయ్యర్
భారత్ 314 పరుగులకు ఆలౌట్
IND vs BAN 2nd Test 2022 : ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎట్టకేలకు సత్తా చాటాడు. మరో వైపు కంటిన్యూగా శ్రేయస్ అయ్యర్ దుమ్ము రేపాడు.
ఫస్ట్ టెస్ట్ లో సైతం అయ్యర్ అదుర్స్ అనిపించాడు. పుజారా దుమ్ము రేపితే రెండో టెస్టులో ఆశించిన మేర రాణించ లేదు కేఎల్ రాహుల్, పుజారా. టెస్ట్ మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ కెప్టెన్ హసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తక్కువ స్కోర్ కే చాప చుట్టేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు(IND vs BAN 2nd Test 2022) 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టుపై 87 పరుగుల లీడ్ సాధించింది ఇండియా.
భారత జట్టులో రిషబ్ పంత్ 93 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 87 రన్స్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ కలిసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ ను అందించడంలో కీలక పాత్ర పోషించారు.
అంతకు ముందు జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా శుభ్ మన్ గిల్ 20 రన్స్ చేశాడు. ఫస్ట్ టెస్టులో సత్తా చాటిన వైస్ కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ది సేమ్ సీన్ ఈసారి కూడా నిరాశకు గురి చేశాడు. కేవలం 24 రన్స్ మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, ఉమేష్ యాదవ్ 14 పరుగులు చేసి అయ్యిందనిపిం
చారు. ఇక బంగ్లా బౌలర్లలో ఇస్లామ్ 4 వికెట్లు తీస్తే షకీబ్ హసన్ 4 వికెట్లు, తస్కిన్ , మెహిదీ చెరో వికెట్ తీశారు.
Also Read : సర్వం సన్నద్ధం వేలం పాటకు సిద్దం