IND vs BAN 2nd Test : భారత్ విజయం టెస్టు సీరీస్ కైవసం
ఒడ్డుకు చేర్చిన అయ్యర్..అశ్విన్
IND vs BAN 2nd Test : బంగ్లా టూర్ లో భాగంగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు(IND vs BAN 2nd Test) ఘన విజయాన్ని నమోదు చేసింది. చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఒక రకంగా గెలుపు దోబూచులాడింది. ఒకానొక దశలో కేవలం 145 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఛేదిస్తుందనుకున్న టీమ్ ఇండియా విక్టరీ కోసం నానా తంటాలు పడింది.
వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా చివరకు శ్రేయస్ అయ్యర్ , రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్ గెలుపునకు అడ్డుగోడగా నిలబడ్డారు. భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. వారిద్దరూ గనుక ఆడక పోయి ఉండి ఉంటే టీమిండియా చేతులెత్తేసేంది. ఒక రకంగా బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ స్కిప్పర్ హసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి 227 పరుగులకే చాప చుట్టేసింది బంగ్లా. అనంతరం టీమిండియా 304 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 287 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 87 పరుగులు కలుపుకుంటే భారత్ ముందు కేవలం 145 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఓవర్ నైట్ స్కోర్ 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ఇక ఆదివారం ఆట ప్రారంభించిన వెంటనే మరో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఓడి పోతుందని అభిమానులు అనుకున్నారు. కానీ మరో వికెట్ పడకుండా శ్రేయాస్ అయ్యర్ రవిచంద్రన్ అశ్విన్ జాగ్రత్త పడ్డారు. విక్టరీలో కీలక పాత్ర పోషించారు. 2-0 తేడాతో టెస్టు సీరీస్ టీమిండియా వశమైంది.
Also Read : బెన్ స్టోక్స్ పై ఎంఎస్ ధోనీ ఫోకస్