IND vs BAN 3rd ODI : టీమిండియా సెన్సేషన్ విక్టరీ
272 పరుగుల తేడాతో విజయం
IND vs BAN 3rd ODI : బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇప్పటికే వన్డే సీరీస్ కోల్పోయింది టీమిండియా. ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్ లో సత్తా చాటింది. భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసింది.
ఇది ఓ రికార్డ్ స్కోర్. పలు రికార్డులు భారత్ వైపు నమోదు అయ్యాయి. విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ ఉండగా రెండో స్థానంలో నిలిచాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉండగా 410 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 227 పరుగుల తేడాతో ఓటమి(IND vs BAN 3rd ODI) పాలైంది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. షకీబ్ హాసన్ 43 రన్స్ చేస్తే లిట్టన్ దాస్ 29, యాసిరర్ అలీ 25, మహ్ముదల్లా 20 పరుగులు తప్పా ఏ ఒక్క క్రికెటర్ పెద్దగా రాణించ లేక పోయారు.
కేవలం 34 ఓవర్లలోనే 182 పరుగులకే కుప్ప కూలింది బంగ్లాదేశ్. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీస్తే , ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు , అక్షర్ పటేల్ 2, సిరాజ్ , కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే 2-1 తేడాతో బంగ్లాదేశ్ వన్డే సీరీస్ కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా గత రెండు వన్డేలలో రెచ్చి పోయిన మెహదీ హసన్ మిరాజ్ ఈసారి తేలి పోయాడు.
Also Read : ఇంగ్లండ్ ఔట్ సెమీస్ కు ఫ్రాన్స్
Hi