IND vs BAN T20 World Cup : భారత్ బంగ్లాదేశ్ కీలక మ్యాచ్
మ్యాచ్ కు వర్షం అడ్డంకి
IND vs BAN T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచ్ బుధవారం జరగనుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై విజయం సాధించగా సౌత్ ఆఫ్రికాతో ఓడి పోయింది. పేలవమైన ఫీల్డింగ్, చెత్త బ్యాటింగ్ తో చేతులెత్తేశారు క్రికెటర్లు.
తాజాగా బంగ్లాదేశ్ తో నాలుగో లీగ్ మ్యాచ్(IND vs BAN T20 World Cup) ఆడేందుకు సిద్దమైంది. టీమిండియా సెమీ ఫైనల్ కు చేరాలంటే తప్పనిసరిగా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో చివరి దాకా పోరాడింది. కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఎలాగైనా సరే టీమిండియాకు షాక్ ఇవ్వాలని యోచిస్తోంది.
చూస్తే పసి కూనలైనా ప్రత్యర్థుల జట్లకు ఖంగు తినిపించే సత్తా బంగ్లాకు ఉంది. మరో వైపు వర్షం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు వాన వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఏయే జట్లు సెమీస్ కు వస్తాయనేది స్పష్టం రాలేదు. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతుండడం విశేషం.
గ్రూప్ -బిలో పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ , ఇండియా ఉన్నాయి. కప్ గెలవడం తమ టార్గెట్ కాదని కానీ దిగ్గజ జట్లకు కోలుకోలేని షాక్ ఇవ్వడమే తమ ముందున్న టార్గెట్ అని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ . కేఎల్ రాహుల్ , ఇతర ఆటగాళ్ల ఫామ్ పై ఆందోళన చెందుతోంది టీమ్ మేనేజ్ మెంట్. మరో వైపు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఆశించిన మేర రాణించడం లేదు.
Also Read : కేఎల్ రాహుల్ పుంజుకోవడం ఖాయం