IND vs BAN T20 World Cup : బంగ్లాదేశ్ పై టీమిండియా భ‌ళా

ఉత్కంఠ భ‌రిత పోరులో విక్ట‌రీ

IND vs BAN T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్-12 లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి దాకా టెన్ష‌న్ నెల‌కొంది. ప‌సికూన‌ల‌ని భావించిన బంగ్లాదేశ్ భార‌త జ‌ట్టుకు(IND vs BAN T20 World Cup) చుక్క‌లు చూపించింది. టీమిండియా చివ‌ర‌కు 5 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో భారీ స్కోర్ సాధించింది. విరాట్ కోహ్లీ మ‌రోసారి రాణించాడు. స్కోర్ పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో అర్ధాంత‌రంగా వ‌ర్షం రావ‌డంతో అంపైర్లు మ్యాచ్ ను కేవ‌లం 16 ఓవ‌ర్ల‌కు కుదించారు. బంగ్లాదేశ్ ముందు 151 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించారు.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు 145 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. అంత‌కు ముందు భార‌త్ 184 ప‌రుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ జ‌ట్టులో లిట‌న్ దాస్ 60 ప‌రుగుల‌తో రెచ్చి పోగా షాంటో 21 ర‌న్స్ తో స‌త్తా చాటాడు. దొరికిన బంతిని ఎక్క‌డా వ‌ద‌ల‌కుండా దంచి కొట్ట‌డం ప్రారంభించారు. ఆ జ‌ట్టు 7 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట పోకుండా 66 ర‌న్స్ చేసింది.

ఒక ర‌కంగా టీమిండియా జ‌ట్టుకు బెంబేలెత్తించింది. ఒకానొక ద‌శ‌లో ఇచ్చిన ల‌క్ష్యాన్ని సుల‌భంగా ఛేదిస్తుంద‌ని అనుకున్నారు. ఇదే స‌మ‌యంలో లిట‌న్ దాస్ 60 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ కాఆగా షాంటో ష‌మీ బౌలింగ్ లో చిక్కాడు. ఆ త‌ర్వాత ఆసిఫ్ 3, ష‌కీబ్ 13, యాసిర్ 1, మొసాడిక్ 6 ప‌రుగుల‌కే వెంట వెంట‌నే వెనుదిరిగారు . దీంతో మ్యాచ్ భార‌త్ వైపు మొగ్గింది. అర్ష్ దీప్ , పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు.

Also Read : ర‌న్ మెషీన్ సెన్సేష‌న్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!