IND vs ENG 5th Test : భారత్ కు షాక్ గెలుపు బాటలో ఇంగ్లండ్
దంచి కొట్టిన జో రూట్..రెచ్చి పోయిన బెయిర్ స్టో
IND vs ENG 5th Test : ఇప్పటికే స్వదేశంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ ను మట్టి కరిపించి, చుక్కలు చూపించిన ఇంగ్లండ్ మరోసారి తన సత్తా చాటింది. మొదటి ఇన్నింగ్స్ లో తడబాటుకు గురైనా రెండో ఇన్నింగ్స్ లో దుమ్ము రేపింది.
చెప్పి మరీ దంచి కొడుతున్న బెయిర్ స్టో విధ్వంసం ఇంకొ కొనసాగుతూనే ఉంది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
రెండో ఇన్నింగ్స్ లోనూ మెరుగైన స్కోర్ చేసింది భారీ టార్గెట్ ఆతిథ్య జట్టు ముందుంచింది.
378 పరుగుల లక్ష్యం ముందుంటే ఏ ప్రత్యర్థి జట్టుకైనా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇంగ్లండ్ భారత్(IND vs ENG 5th Test) ఆశలపై నీళ్లు
చల్లేందుకు రెడీగా ఉంది. విధ్వంసకరమైన బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్నారు.
భారత బౌలర్ల భరతం పడుతున్నారు. జో రూట్ , బెయిర్ స్టో మారథాన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెస్టు
మ్యాచ్ అనుకోడానికి వీలు లేకుండా చేశారు ఈ ఇద్దరు క్రికెటర్లు.
భారీ స్కోర్ ఛేదన కోసం బరిలొకి దిగిన ఇంగ్లండ్ 109 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ దే పై అనిపించింది. కానీ బెయిర్ స్టో ,
జో రూట్ మైదానంలో పాదరసంలా కదిలారు.
వీరిద్దరూ కలిసి ఇప్పటికే 150 పరుగులు చేశారు. ఇంకా ఆ జట్టు చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంగ్లండ్ స్కోర్ 259 పరుగులు చేసింది.
జో రూట్ 9 ఫోర్లతో 76 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా బెయిర్ స్టో 8 ఫోర్లు ఒక సిక్సర్ తో 72 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇంకో రోజంతా ఆట ఉంది.
కేవలం 119 పరుగులు చేస్తే చాలు భారత్ పై మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుంది ఇంగ్లండ్ జట్టు. ఏదైనా అద్భుతం జరిగితే
తప్పా భారత్ ఓటమి నుంచి తప్పించు కోలేదు.
Also Read : మెరిసిన మంధాన రాణించిన వర్మ