IND vs ESP Hockey World Cup : స్పెయిన్ పై భారత్ విక్టరీ
2-0 తేడాతో ఘన విజయం
IND vs ESP Hockey World Cup : ప్రపంచ హాకీ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే హాకీని ఆడుతున్న టీమ్ లు చేరుకున్నాయి. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది. వరల్డ్ కప్ లో భాగంగా భారత్ జట్టు బోణీ కొట్టింది.
స్పెయిన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 2-0 తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది టీమిండియా. హర్మన్ ప్రీత్ సింగ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మరో వైపు ఒడిశా సీఎం సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఈ వరల్డ్ కప్ లో గనుక భారత హాకీ జట్టు హాకీ ప్రపంచ కప్ గెలుపొందితే జట్టులోని ఒక్కో ఆటగాడికి ప్రభుత్వ పరంగా రూ. కోటి బహుమనంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు సీఎం.
పట్నాయక్ ఇచ్చిన పిలుపుతో ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు. ఇవాళ ప్రారంభమైన టోర్నమెంట్ మొదటి రోజు చివరి గ్రూప్ మ్యాచ్ లో రూర్కెలా లోని బిర్సా ముండా స్టేడియంలో భారత్, స్పెయిన్ తలపడ్డాయి(IND vs ESP Hockey World Cup). నువ్వా నేనా అనే రీతిలో ఇరు జట్లు తలపడ్డాయి.
భారత్ 48 సంవత్సరాల తర్వాత రెండు ఫస్ట్ హాఫ్ గోల్స్ సహాయంతో టైటిల్ గెలుచుకుంది. టీమిండియా ఆట ప్రారంభం నుంచి స్పెయిన్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చింది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహిత్ దాస్ 12వ నిమిషంలో తొలి గోల్ కొట్టాడు. ఇక రెండో గోల్ ను హార్దిక్ సింగ్ చేశాడు.
Also Read : దుబాయ్ టోర్నీ తర్వాత సానియా గుడ్ బై