IND vs NZ 1st ODI : అందరి చూపు ఉప్పల్ వైపు
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
IND vs NZ 1st ODI : భారత క్రికెట్ జట్టు ఫుల్ జోష్ లో ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సీరీస్ తో పాటు వన్డే సీరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా జట్లతో సీరీస్ ఆడేందుకు టీమిండియా(IND vs NZ 1st ODI) సిద్దమైంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు 2-1 తేడాతో టీ20 సీరీస్ గెలుపొందగా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ 3-0 తేడాతో వన్డే సీరీస్ గెలుపొందింది.
జనవరి 18 నుంచి కీవీస్ తో వన్డే సీరీస్ ఆడేందుకు సన్నద్దమైంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ బోర్డు జట్లను వేర్వేరుగా ప్రకటించింది. ఇక వన్డే సీరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉప్పల్ లో మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) ఏర్పాట్లు చేసింది.
ఆన్ లైన్ లో టికెట్లను విక్రయించింది. ఇప్పటి వరకు 16 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది భారత్ జట్టు(IND vs NZ 1st ODI). ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే వన్డే వరల్డ్ కప్ కు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ ఏడాదిలో రెండు మెగా టోర్నీలు జరగనున్నాయి. ఒకటి పాకిస్తాన్ లో ఆసియా కప్ జరగనుండగా..భారత్ వరల్డ్ కప్ ను నిర్వహించనుంది. ఇప్పుడు భారత్ కు ఫుల్ ప్రాక్టీస్ జరగనుంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది భారత్. ఇక టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 35 మ్యాచ్ లు జరిగాయి. కీవీస్ 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. భారత్ 26 మ్యాచ్ లలో గెలుపొందింది.
Also Read : రోహిత్..కోహ్లీపై సన్నీ కామెంట్స్