IND vs NZ 1st ODI : భార‌త్ న్యూజిలాండ్ బిగ్ ఫైట్

ఉప్ప‌ల్ లో తొలి వ‌న్డే మ్యాచ్

IND vs NZ 1st ODI : శ్రీ‌లంక‌తో జ‌రిగిన సీరీస్ లో స‌త్తా చాటిన భార‌త జ‌ట్టు(IND vs NZ 1st ODI) మరో వ‌న్డే సీరీస్ కోసం ముస్తాబైంది. హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా తొలి వ‌న్డే మ్యాచ్ న్యూజిలాండ్ తో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కు శ్రేయాస్ అయ్య‌ర దూర‌మ‌య్యాడు. ర‌జిత్ పాటిదార్ లేదా సూర్య కుమార్ యాద‌వ్ కు అవ‌కాశం ద‌క్క‌నుంది.

గాయం కార‌ణంగా ఇప్ప‌టికే రిష‌బ్ పంత్ , కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ఆడ‌లేదు. మ‌రో వైపు న్యూజిలాండ్ పాకిస్తాన్ టూర్ లో దుమ్ము రేపింది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వ‌న్డే సీరీస్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. కార‌ణం ఏమిటంటే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది.

ఈసారి ఎలాగైనా స‌రే వ‌ర‌ల్డ్ కప్ స్వంతం చేసుకునే దిశ‌గా టీమిండియా(IND vs NZ 1st ODI) రాటు దేలాల‌ని ప్ర‌యోగాలు చేస్తోంది. అందుకే ప‌లు ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుట్టింది. మ‌రోసారి చేత‌న్ శ‌ర్మ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ గా ఎన్నిక కావ‌డంతో కొన్ని ప్రాంతాల‌కే ప్ర‌యారిటీ ల‌భిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు.

ఇక ఉప్ప‌ల్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే గ‌తంలో చోటు చేసుకున్న ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఈసారి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఏర్పాట్లు ఏసింది. ఆన్ లైన్ లోనే టికెట్ల‌ను అమ్మకానికి పెట్టింది. కీవీస్ తో మూడు వ‌న్డే మ్యాచ్ లు ఆడ‌నుంది. సూర్య‌కు ఇది మంచి ఛాన్స్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. సూర్య విష‌యానికి వ‌స్తే 17 వ‌న్డేల్లో కేవ‌లం 388 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

భార‌త జ‌ట్టు విష‌యానికి వ‌స్తే రోహిత్ శ‌ర్మ కెప్టెన్. కిష‌న్ , గిల్ , కోహ్లీ, సూర్య‌, హార్దిక్ , సుంద‌ర్ , షాబాజ్ , చాహ‌ల్ , కుల్దీప్ , ష‌మీ, సిరాజ్ , మాలిక్

న్యూజిలాండ్ జ‌ట్టులో లాథ‌మ్ కెప్టెన్ , అలెన్ , కాన్వే, ఫిలిప్స్ , నీకోల్స్ , మిచెల్ , బ్రాస్ వెల్ , ఫెర్గుస‌న్ , బ్రాస్ వెల్ , షిప్లీ, టిక్న‌ర్ ఉన్నారు.

Also Read : అంద‌రి చూపు ఉప్ప‌ల్ వైపు

Leave A Reply

Your Email Id will not be published!