IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్

రాణించిన ధావ‌న్..గిల్..అయ్య‌ర్

IND vs NZ 1st ODI : శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలో యువ భార‌త జ‌ట్టు ప‌రుగుల వ‌ర‌ద పారించింది. శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. దీంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 306 ప‌రుగులు(IND vs NZ 1st ODI) చేసింది. భార‌త్ భారీ టార్గెట్ ముందుంచింది.

భార‌త బ్యాట‌ర్లలో కెప్టెన్ శిఖ‌ర్ ధాన్ , శుభ్ మ‌న్ గ‌ల్ హాఫ్ సెంచ‌రీల‌తో స‌త్తా చాటారు. ఇక మిడిల్ ఆర్డ‌ర్ లో వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ దుమ్ము రేపాడు. సంజూ శాంస‌న్ 36 ర‌న్స్ చేస్తే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 37 ప‌రుగులు చేసి రాణించారు. మ్యాచ్ ప‌రంగా చూస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెన‌ర్లు దుమ్ము రేపారు.

శుభ్ మ‌న్ గిల్ 50 ర‌న్స్ చేస్తే శిఖ‌ర్ ధావ‌న్ 77 ప‌రుగులు చేశారు. ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ కు 124 ప‌రుగులు చేశారు. ఫామ్ లో ఉన్న ఇద్ద‌రు ఓపెన‌ర్ల‌ను గిల్ ఫెర్గూస‌న్ , సౌథీ పెవిలియ‌న్ పంపించారు. మ‌రోసారి రిష‌బ్ పంత్ నిరాశ ప‌రిచాడు. కేవ‌లం 15 ప‌రుగులు చేసిన పంత్ ను ఫెర్గూస‌న్ బోల్తా కొట్టించాడు.

సూర్య కుమార్ యాద‌వ్ నిరాశ ప‌రిచాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయి 170 ప‌రుగులు చేసింది. మైదానంలోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ క‌లిసి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. జ‌ట్టును ఆదుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి 93 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

మిల్నే ఔట్ చేయ‌డంతో సంజూ స్థానంలో సుంద‌ర్ వ‌చ్చాడు. వ‌స్తూనే 16 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 37 ర‌న్స్ చేశాడు. దీంతో భారీ స్కోర్ చేసింది భార‌త జ‌ట్టు.

Also Read : పంత్ కే ప్ర‌యారిటీ శాంస‌న్ కు క‌ష్ట‌మే

Leave A Reply

Your Email Id will not be published!