IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ తో భారత్ బిగ్ ఫైట్
ఈసారైనా శాంసన్ కు ఛాన్స్ దక్కుతుందా
IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ టూర్ లో ఉన్న భారత జట్టు టి20 సీరీస్ గెలుపొంది మంచి ఊపులో ఉంది. వైద్య చికిత్స కారణంగా చివరి టి20 మ్యాచ్ కు దూరంగా ఉన్న కేన్ విలియమ్సన్ శుక్రవారం జరిగే మొదటి వన్డే మ్యాచ్ కు తిరిగి రానున్నారు. బీసీసీఐ టి20 జట్టు కెప్టెన్ పగ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తే వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ కు మూడు వన్డేల(IND vs NZ 1st ODI) సీరీస్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
దీంతో గబ్బర్ సేన కీవీస్ తో తలపడేందుకు రెడీ అయ్యింది. ఇక న్యూజిలాండ్ తో ఆడిన సీరీస్ లో 0-3 తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది భారత జట్టు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 మెగా టోర్నీలో సెమీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడి పోయింది. ఇక ఇదే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది టీమిండియా.
దీంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ , రవి చంద్రన్ అశ్విన్ తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ విశ్రాంతి పేరుతో పక్కన పెట్టింది.
ఇక రాహుల్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ను తాత్కాలిక కోచ్ గా ఎంపిక చేసింది. ప్రస్తుతం శిఖర్ ధావన్ కు అగ్ని పరీక్ష. స్వదేశంలో అత్యంత బలమైన
జట్టుగా పేరొందింది న్యూజిలాండ్ . అంతర్జాతీయ క్రికెట్ లో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు కీవీస్ టీంలో. యువ ఆటగాళ్లతో నిండి ఉన్న శిఖర్ సేన ఏ మేరకు రాణిస్తుందనేది చూడాలి.
ఇక పోతే గత కొంత కాలంగా కేరళ స్టార్ సంజూ శాంసన్ ను ఎందుకు పక్కన పెడుతున్నారనే దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీరీస్ లోనైనా తీసుకుంటారా లేక పక్కన పెడతారా అనేది వేచి చూడాలి.
Also Read : పంత్ కే ప్రయారిటీ శాంసన్ కు కష్టమే