IND vs NZ 1st ODI : చెల‌రేగిన టామ్..కేన్..కివీస్ విన్

7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న మూడు వ‌న్డే సీరీస్ లో భాగంగా ఆక్లాండ్ లో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలోని న్యూజిలాండ్ జ‌ట్టు. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 306 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన న్యూజిలాండ్(IND vs NZ 1st ODI) కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి అవ‌లీల‌గా భారీ ల‌క్ష్యాన్ని ఛేదించింది. కీవీస్ జ‌ట్టులో టామ్ లాథ‌మ్ దుమ్ము రేపాడు. భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఏకంగా సెంచ‌రీతో మెరిశాడు. మ‌రో వైపు కేన్ విలియ‌మ్స‌న్ కూడా రెచ్చి పోయాడు.

బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న కేన్ మామ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. 94 ప‌రుగులు చేశాడు. చివ‌రి దాకా నాటౌట్ గా నిలిచాడు. ఇదిలా ఉండ‌గా గ్రౌండ్ లోకి వ‌చ్చిన వెంట‌నే ఫిన్ వాలెన్ , డెవాన్ కాన్వే , డారిల్ మిచెల్ వికెట్ల‌ను కోల్పోయింది. అయితే టామ్ లాథ‌మ్ , కేన్ విలియ‌మ్స‌న్ క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు.

లాథ‌మ్ ఏకంగా 145 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ‌రో వైపు కేన్ విలియ‌మ్స‌న్ కూడా దుమ్ము రేపాడు. ఇదిలా ఉండ‌గా ఇంకా 17 బంతులు మిగిలి ఉండ‌గానే న్యూజిలాండ్ జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టులో కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ , శుభ్ మ‌న్ గిల్ స‌త్తా చాటారు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన సూర్య కుమార్ యాద‌వ్ , రిష‌బ్ పంత్ నిరాశ ప‌రిచారు. ఈ త‌రుణంలో మైదానంలోకి దిగిన సంజూ శాంస‌న్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ 93 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. చివ‌ర్లో వ‌చ్చిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ కేవ‌లం 16 బంతులు మాత్ర‌మే ఆడి 37 ర‌న్స్ చేశాడు.

Also Read : పంత్ కే ప్ర‌యారిటీ శాంస‌న్ కు క‌ష్ట‌మే

Leave A Reply

Your Email Id will not be published!