IND vs NZ 1st T20 : టీమిండియా న్యూజిలాండ్ బిగ్ ఫైట్

రాణిస్తారా చేతులెత్తేస్తారా

IND vs NZ 1st T20 : హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ లో భాగంగా శుక్ర‌వారం బ‌ల‌మైన న్యూజిలాండ్ జ‌ట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యింది. కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలోని న్యూజిలాండ్ అన్ని రంగాల్లో బ‌లంగా ఉంది.

ఇక భార‌త్ , కీవీస్ జ‌ట్లు ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీ ఫైన‌ల్లో చాప చుట్టేశాయి. గ్రూప్ -ఎలో ఉన్న కీవీస్ ను దాయాది పాకిస్తాన్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసి ఫైన‌ల్ కు చేరింది. 

ఇక గ్రూప్ -బిలో ఉన్న భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలై ఇంటి బాట ప‌ట్టింది.

దీంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ తో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌల‌ర్ ర‌విచంద్ర‌న్

అశ్విన్ ను ప‌క్క‌న పెట్టింది విశ్రాంతి పేరుతో. ఇక హెడ్ కోచ్ స్థానంలో బెంగ‌ళూరు క్రికెట్ అకాడెమీ డైరెక్ట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌న్ ను ఎంపిక చేసింది.

ఇక భార‌త జ‌ట్టు(IND vs NZ 1st T20) మూడు టి20 మ్యాచ్ ల‌తో పాటు శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలో మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ ఆడ‌నుంది. టి20 

మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ లోని వెల్లింగ్ట‌న్ లో న్యూజిలాండ్ తో పోటీ ప‌డ‌నుంది. 

ప్ర‌స్తుతం ఉన్న జ‌ట్టులో అంతా యువ ర‌క్త‌మే ఉంది. ప‌వ‌ర్ ప్లేలో ప్ర‌ధానంగా విఫ‌లం కావ‌డం వ‌ల్ల‌నే భార‌త జ‌ట్టు ఓడి పోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది.

ఈ త‌రుణంలో ఇషాన్ కిష‌న్ , శుభ్ మ‌న్ గిల్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ , సూర్య కుమార్ యాద‌వ్, సంజూ శాంస‌న్ , హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్ కు అగ్ని

ప‌రీక్ష కానుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.

Also Read : టి20 ర్యాంకింగ్స్ లో సూర్య..హ‌స‌రంగ టాప్

Leave A Reply

Your Email Id will not be published!