IND vs NZ 2nd ODI : రెండో వన్డేలో కీలక మార్పులు
పేలవమైన బౌలింగ్ తీరుపై ఫోకస్
IND vs NZ 2nd ODI : హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు చుక్కలు చూపించింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడింది. ఒకానొక దశలో బ్రేస్ వెల్ గనుక ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.
యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నా..న్యూజిలాండ్ జట్టులో మిచెల్ బ్రేస్ వెల్ ఆట ముందు వెల వెల బోయింది ఆ ఇన్నింగ్స్ . ఆకాశమే హద్దుగా చెలరేగిన తీరు, కళ్లు చెదిరేలా ఆడిన షాట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక భారత జట్టు యాజమాన్యం రెండో వన్డేలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది(IND vs NZ 2nd ODI) .
ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు సన్నాహంగా వన్డే మ్యాచ్ లను పరిగణలోకి తీసుకుంటోంది. కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రధానంగా న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయినా ఊహించని రీతిలో భారత బౌలర్ల భరతం పట్టాడు బ్రేస్ వెల్.
మిచెల్ దెబ్బకు మన బౌలర్లు బెంబేలెత్తి పోయారు. దీంతో భారత జట్టు లో రెండో వన్డేకు ఉమ్రాన్ మాలిక్ ను తీసుకోనున్నట్లు టాక్. జనవరి 21న రాయపూర్ లో మ్యాచ్ జరగనుంది. ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టనుంది. టీమిండియా ప్రాబబుల్స్ చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ , శుభ్ మన్ గిల్ , ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , పాండ్యా, సుందర్ , కుల్దీప్ యాదవ్ , షమీ, సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్ ఆడతారు.
Also Read : శుభ్ మన్ గిల్ ‘డబుల్’ కమాల్