IND vs NZ 2nd T20 : ఉత్కంఠ పోరులో భార‌త్ భ‌ళా

రాణించిన సూర్య ..పాండ్యా

IND vs NZ 2nd T20 : సీరీస్ ను నిర్దేశించే కీల‌క‌మైన రెండో టీ20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి సీరీస్ స‌మం చేసింది. దీంతో మూడో టీ20 మ్యాచ్ మ‌రింత ఉత్కంఠ‌గా మారే అవ‌కాశం ఉంది. వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కు అస‌లు సిస‌లైన మ‌జాను క‌లుగ చేసింది ఈ మ్యాచ్.

కేవ‌లం 100 ప‌రుగుల టార్గెట్ మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్లు విజ‌యం కోసం గ‌ట్టిగా పోరాడాయి. వ‌న్డే సీరీస్ లో సెంచ‌రీల మోత మోగించిన శుభ్ మ‌న్ గిల్ ,ఇషాన్ కిష‌న్ లు మ‌రోసారి నిరాశ ప‌రిచారు.

ఇక 32 బంతులు ఎదుర్కొన్న కిష‌న్ కేవ‌లం 19 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. అన‌వ‌స‌ర‌మైన ర‌న్ కోసం వెళ్లి ర‌నౌట్ అయ్యాడు. పూర్తిగా స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా మారిన ఈ మైదానంలో కీవీస్ బౌల‌ర్లు ప‌రుగులు ఇవ్వ‌కుండా భార‌త బ్యాట‌ర్ల‌ను(IND vs NZ 2nd T20) క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

ఇక 11వ ఓవ‌ర్ లో త్రిపాఠీ వెనుదిర‌గ‌డంతో ఇబ్బందిగా మారింది. ఈ స‌మ‌యంలో క్రీజులో ఉన్న సూర్య కుమార్ యాద‌వ్ స్కోర్ ను మెల మెల్ల‌గా పెంచే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌రి ఓవ‌ర్ లో 6 బంతులు 6 ర‌న్స్ చేయాల్సి వ‌చ్చింది.

ఆఖ‌రున 2 బంతుల‌లో 3 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. సూర్య కుమార్ యాద‌వ్ సైతం చాలా క‌ష్ట ప‌డాల్సి వ‌చ్చింది. 31 బాల్స్ ఎదుర్కొని 26 ర‌న్స్ చేస్తే పాండ్యా అత‌డికి స‌పోర్ట్ గా నిలిచాడు. అంత‌కు ముందు న్యూజిలాండ్ 8 విక‌కెట్లు కోల్పోయి 99 ర‌న్స్ చేసింది.

Also Read : విశ్వ విజేత‌కు భారీ న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!