IND vs NZ 3rd T20 : కీవీస్ ఓటమి టీమిండియాదే సీరీస్
అహ్మదాబాద్ లో గిల్ కిల్..పాండ్యా అదుర్స్
IND vs NZ 3rd T20 : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో 2-1 తేడాతో సీరీస్ దక్కించుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సత్తా చూపితే మరోసారి తన స్టామినా ఏమిటో చూపించాడు యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్. వన్డేలో సెంచరీల మోత మోగించిన గిల్ ..చివరి టీ20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. 166 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది టీమిండియా.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు(IND vs NZ 3rd T20) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. నాలుగు వికెట్లతో కీవీస్ విజయావకాశాలను దెబ్బ కొట్టాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ కేవలం 66 పరగులకే చాప చుట్టేసింది.
టాస్ గెలిచిన పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం జట్టుకు లాభించింది. అయితే మరోసారి ఓపెనర్ ఇషాన్ కిషన్ నిరాశ పరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అతడి స్థానంలో వచ్చిన త్రిపాఠితో కలిసి శుభ్ మన్ గిల్ రెచ్చి పోయాడు. ఇద్దరూ కలిసి 80 రన్స్ జోడించారు.
త్రిపాఠి 22 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. సూర్య యాదవ్ 24 పరుగులు చేస్తే శుభ్ మన్ గిల్ 63 బంతులు ఎదుర్కొని 126 రన్స్ చేసి చుక్కలు చూపించాడు. ఇక కీవీస్ జట్టులో మిచెల్ 35 రన్స్ చేస్తే సాన్టర్న్ 13 రన్స్ చేశాడు.
Also Read : శుభ్ మన్ గిల్ కమాల్