IND vs NZ ICC World Cup : కోహ్లీ షాన్ దార్ భార‌త్ జోర్దార్

న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్ట‌రీ

IND vs NZ ICC World Cup : ధ‌ర్మ‌శాల – ఐసీసీ(ICC) వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో భార‌త క్రికెట్ స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇది వ‌రుస‌గా టీమిండియాకు ఐదో గెలుపు. ఈ విక్ట‌రీతో భార‌త్ సెమీస్ కు ద‌గ్గ‌రైంది. ధ‌ర్మ‌శాల మైదానంలో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపు న‌మోదు చేసింది. 4 వికెట్ల తేడాతో ఓడించింది.

IND vs NZ ICC World Cup Updates

మొత్తంగా ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో చేసి ఆక‌ట్టుకుంది భార‌త్. ఇక కీవీస్ టీమిండియాపై భారీ స్కోర్ న‌మోదు చేసింది. కీవీస్ ఆట‌గాళ్లు భార‌త బౌల‌ర్ల‌పై దాడి చేశారు. అందినంత మేర ర‌న్స్ తో హోరెత్తించారు. అయితే ష‌మీ మ‌రోసారి ఆప‌ద్బాంధ‌వుడి గా మారాడు. కీవీస్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఈ టోర్నీలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. సెంచ‌రీ చేస్తాడ‌ని భావించారు. కానీ ఉన్న‌ట్టుండి సిక్స్ కొట్ట‌బోయి 95 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. స‌చిన్ రికార్డుకు చేరువ‌య్యాడు వ‌న్డే కెరీర్ లో. న్యూజిలాండ్ ఏకంగా 273 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఇక వ‌రల్డ్ క‌ప్ లో ష‌మీ రెండు సార్లు 5 వికెట్లు కూల్చాడు.

కీవీస్ జ‌ట్టులో మిషెల్ దుమ్ము రేపాడు. 127 బాల్స్ ఎదుర్కొని 9 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 130 ర‌న్స్ చేశాడు. ర‌చిన్ ర‌వీంద్ర 75 ప‌రుగులు చేశాడు. మిగ‌తా బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది టీమిండియా. కోహ్లీ 8 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 95 ర‌న్స్ చేస్తే రోహిత్ 40, గిల్ 26 , అయ్య‌ర్ 33, రాహుల్ 27 , జ‌డేజా 39 ర‌న్స్ చేశారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!