IND vs PAK Asia Cup 2022 : దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో
అందరి కళ్లు భారత్..పాక్ మ్యాచ్ పైనే
IND vs PAK Asia Cup 2022 : యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న మ్యాచ్ కు వేదిక సిద్దమైంది. మెగా టోర్నీ ఆసియా కప్ -2022 యూఏఈ వేదికగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ అనూహ్యంగా శ్రీలంకను మట్టి కరిపించింది.
ఇక ఆగస్టు 28 ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది(IND vs PAK Asia Cup 2022). ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. టికెట్లన్నీ అయి పోయాయి.
మరికొన్నిటి కోసం తెగ పోటీ నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా అంతా ఈ మ్యాచ్ పై ఫోకస్ పెడుతోంది. ఇక ఆసియా కప్ లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు దాయాదుల మధ్య మ్యాచ్ లు జరిగాయి.
ఈ మ్యాచ్ 15వది కావడం విశేషం. యూఏఈ వేదికగా గత ఏడాది 2021లో జరిగిన పోరులో పాకిస్తాన్ భారత్ ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కొనసాగుతుంది మ్యాచ్.
ఇప్పటి వరకు తలపడిన మ్యాచ్ లలో 8 సార్లు టీమిండియా విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ ఆరుసార్లు గెలుపొందింది ఆసియా కప్ లో. 1997లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేశారు. 2018లో చివరి సారిగా కప్ లో భాగంగా తలపడ్డారు.
భారత జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ . కోహ్లీ, యాదవ్ , హూడా, పంత్ , కార్తీక్ , పాండ్యా, జడేజా, అశ్విన్, చాహల్ , బిష్నోయ్ , భువీ, అర్ష్ దీప్ , ఆవేష్ ఖాన్.
పాకిస్తాన్ జట్టు – బాబర్ ఆజమ్ కెప్టెన్, షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్ , అలీ, ఫఖర్ జమాన్ , హైదర్ అలీ, హరీష్ రవూఫ్ , ఇఫ్తకర్ అహ్మద్ , ఖుష్దిల్ షా , నవాజ్ , రిజ్వాన్ , వసీం జూనియర్ , నసీమ్ షా, దహానీ, ఖాదిర్.
Also Read : అరుదైన రికార్డ్ కు చేరువలో రన్ మెషీన్