IND vs PAK Asia Cup 2022 : యుద్దానికి దాయాదులు సిద్దం
అందరి కళ్లు భారత్..పాకిస్తాన్ పైనే
IND vs PAK Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022 లో బంగ్లాదేశ్, హాంకాంగ్ వైదొలిగాయి. ఇక అసలైన పోరు ప్రారంభమైంది. సూపర్ -4 లో భారత్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్టు చేరుకున్నాయి.
తొలి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఆప్గనిస్తాన్ చేతిలో ఓడి పోయింది. చివరకు బంగ్లాదేశ్, హాంకాంగ్ తో గెలుపొందిన లంకేయులు సూపర్ -4కి చేరుకున్నారు.
లీగ్ మ్యాచ్ లో భాగంగా ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.
ఈ మ్యాచ్ లో టీమిండియా గత ఏడాది ఇదే వేదికపై జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్ లో దుమ్ము రేపింది.
ప్రధానంగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా. కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొని 33 రన్స్ చేశాడు.
తాజాగా సూపర్ -4లో కీలకమైన మ్యాచ్(IND vs PAK Asia Cup 2022) ఆడేందుకు సిద్దమయ్యారు దాయాదులు. ఇరు జట్లు అసలైన పోరాటానికి సిద్దమయ్యారు. మరో వైపు పాకిస్తాన్ లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ కు చుక్కలు చూపించింది.
ఏకంగా 156 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఎలాగైనా సరే ఇండియాపై గెలిచి పోయిన పరువు కాపాడు కోవాలని పాకిస్తాన్ కృత నిశ్చయంతో ఉంది.
Also Read : ఉత్కంఠ పోరులో శ్రీలంకదే హవా