IND vs PAK Asia Cup 2022 : బౌల‌ర్ల వైఫ‌ల్యం భార‌త్ ప‌రాజ‌యం

ప్ర‌తీకారం తీర్చుకున్న పాకిస్తాన్

IND vs PAK Asia Cup 2022 :  యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ -2022 సూప‌ర్ – 4లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఓట‌మి పాలైంది. లీగ్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైన పాకిస్తాన్ అదే స్థాయిలో ధీటుగా జ‌వాబిచ్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు(IND vs PAK Asia Cup 2022) 181 ప‌రుగులు చేసింది. భారీ స్కోర్ ముందున్నా పాకిస్తాన్ ఎక్క‌డా తొట్రుపాటుకు

గురి కాలేదు. టీమిండియా బౌల‌ర్లు చెత్త బంతుల‌తో చేతులెత్తేశారు.

అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో క్యాచ్ లు, ఫోర్లు జార విడిచారు. ఒక ర‌కంగా చెప్పాలంటే పూర్తి బాధ్య‌తా రాహిత్యంతో మ్యాచ్ ను చేజేతులారా పోగొట్టుకున్నారు.

భువ‌నేశ్వ‌ర్ , హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చ‌హ‌ల్ చెరో 40 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.

18వ కీల‌క ఓవ‌ర్ లో ఆసిఫ్ అలీ క్యాచ్ ను అర్ష్ దీప్ జార విడిచాడు. అంతేకాకుండా విచ్చ‌ల‌విడిగా వైడ్లు వేశారు. ప‌స లేని బౌలింగ్ తో పాటు చెత్త ఫీల్డింగ్ కొంప ముంచింది.

భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 181 ర‌న్స్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న ర‌న్ మెషీన్

త‌న బ్యాట్ కు ప‌ని చెప్పాడు.

విరాట్ కోహ్లీ 44 బంతులు ఆడి 60 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఓ సిక్స్ ఉంది. అనంత‌రం బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు

కోల్పోయి 182 ర‌న్స్ చేసింది.

ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ దంచి కొట్టాడు. 51 బంతులు ఆడి 71 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. మ‌రో వైపు న‌వాజ్ ఆకాశ‌మే

హ‌ద్దుగా చెల‌రేగాడు. 20 బంతులు ఆడి 42 ర‌న్స్ చేశాడు. 6 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి.

Also Read : వ‌చ్చే సీజ‌న్ లోనూ ధోనీనే కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!