IND vs PAK Asia Cup 2022 : పాకిస్తాన్ పై టీమిండియా హ‌వా

5 వికెట్ల తేడాతో ఘన విజ‌యం

IND vs PAK Asia Cup 2022 : గ‌త ఏడాది యూఏఈ వేదిక‌పై జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ భార‌త జ‌ట్టుపై 10 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని

న‌మోదు చేసింది. దానికి ప్ర‌తీకారంగా టీమిండియా చెల‌రేగింది.

నువ్వా నేనా అన్న రీతిలో చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది మ్యాచ్. ఆసియా క‌ప్ -2022 లో(IND vs PAK Asia Cup 2022) జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో భార‌త్ దే పై చేయి అయింది.

ప్ర‌ధానంగా దాయాదుల పోరు అనే స‌రిక‌ల్లా యావ‌త్ ప్ర‌పంచం ఏం జ‌రుగుతోంది, ఎవ‌రు విక్ట‌రీ న‌మోదు చేస్తార‌నే దానిపై ఊహాగానాలు రేగాయి. పెద్ద

ఎత్తున బెట్టింగ్ లు కూడా చోటు చేసుకున్నాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఆదివారం జ‌రిగిన మ్యాచ్ ఫైన‌ల్ ను త‌ల‌పింప చేసింది. త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థికి చుక్క‌లు చూపించింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది.

19.5 ఓవ‌ర్ల‌లో 147 ర‌న్స్ కే చాప చుట్టేసింది. ఆ జ‌ట్టులో ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ అద్భుతంగా ఆడాడు. 42 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 43 ప‌రుగులు చేశాడు.

ప్ర‌ధానంగా పాక్ బ్యాట‌ర్ల‌ను పూర్తిగా క‌ట్ట‌డి చేశారు భార‌త బౌల‌ర్లు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ 26 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీస్తే  హార్దిక్ పాండ్యా 25 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం బరిలోకి దిగిన భార‌త జ‌ట్టు ఆదిలోనే కేఎల్ రాహుల్ వికెట్ ను కోల్పోయింది. మ్యాచ్ చివ‌రి బాల్ దాకా టెన్ష‌న్ నెల‌కొంది. 5 వికెట్లు కోల్పోయి 148 ర‌న్స్ చేసింది.

త‌న కెరీర్ లో 100వ టి20 మ్యాచ్ ఆడిన కోహ్లీ 34 బంతులు ఆడి 35 ర‌న్స్ చేశాడు. త‌న స‌త్తా ఏమిటో చూపించాడు

హార్దిక్ పాండ్యా(Hardik Pandya). అటు  బౌలింగ్ లో ఇటు  బ్యాటింగ్ లో రాణించాడు.

17 బంతులు ఆడి 4 ఫోర్లు ఓ సిక్స్ తో 33 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు జ‌డేజా 29 బంతులు ఆడి 35 ర‌న్స్ చేశాడు.

Also Read : హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో

Leave A Reply

Your Email Id will not be published!