IND vs PAK Asia Cup 2023 : దాయాదుల పోరుకు సిద్దం
10న పాకిస్తాన్..ఇండియా మ్యాచ్
IND vs PAK Asia Cup 2023 : శ్రీలంక – ఆసియా కప్ 2023కు సంబంధించి కీలకమైన పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలైన పాకిస్తాన్ , భారత్ జట్లు(IND vs PAK Asia Cup 2023) సిసలైన యుద్దానికి దిగాయి. ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ లోకి దిగింది.
IND vs PAK Asia Cup 2023 Trending
రోహిత్ సేనకు అగ్ని పరీక్షగా మారింది ఈ మ్యాచ్. గ్రూప్ -4కు భారత్ నేపాల్ పై భారీ తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో బలంగా ఉన్నాయి. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ ఎవరు గెలుస్తారో వారికే గెలిచే ఛాన్స్ ఉంది.
గతంలో జరిగిన ఆసియా కప్ ను శ్రీలంక ఎగరేసుకు పోయింది. ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించింది. విస్తు పోయేలా చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆ కప్ లో భారత జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. ఇక త్వరలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇప్పటికే గాయపడిన కేఎల్ రాహుల్ ను వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మరో వైపు ఎలాంటి ప్రతిభ కనబర్చని శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీసీఐ మాజీ సెలెక్టర్, మాజీ క్రికెటర్ , కామెంటేటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. మొత్తంగా ఆసియా కప్ గెలిస్తే బెటర్ లేదంటే మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు.
Also Read : Pawan Kalyan : బాబు అరెస్ట్ ను ఖండిస్తున్నా