IND vs PAK Asia Cup 2023 : భారత్ భళా పాక్ విలవిల
భారీ తేడాతో ఘోర ఓటమి
IND vs PAK Asia Cup 2023 : ఆసియా కప్ 2023లో భాగంగా జరిగిన కీలక పోరులో దాయాది పాకిస్తాన్ పై భారత(IND vs PAK Asia Cup 2023) జట్టు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 356 రన్స్ భారీ స్కోర్ సాధించింది.
IND vs PAK Asia Cup 2023 Match Updates
అనంతరం 357 పరుగుల బిగ్ టాస్క్ తో మైదానం లోకి దిగిన పాకిస్తాన్ ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయింది. 32 ఓవర్లలో 128 రన్స్ కే పరిమితమైంది. భారత జట్టు ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో దుమ్ము రేపింది. ప్రధానంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, గాయం తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కుల్ దీప్ యాదవ్ తన బౌలింగ్ తో మెస్మరైజ్ చేశాడు. వరుసగా 5 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. కోహ్లీ తన వన్డే కెరీర్ లో 47వ శతకం సాధించాడు. 94 బాల్స్ ఎదుర్కొని 122 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ తన కెరీర్ లో 6వ సెంచరీ చేశాడు. 106 బంతులలో 111 రన్స్ చేశాడు.
ఈ విజయంతో భారత జట్టు ఆసియా కప్ పై కన్నేసింది. మరో వైపు ఆసియా కప్ లో ఆడుతున్న శ్రీలంక జట్టు సైతం సూపర్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ గెలుపు రోహిత్ సేనకు ఓ టానిక్ లా పని చేసిందని చెప్పక తప్పదు.
Also Read : TTD Chairman : వరుణ యాగంతో దేశం సుభిక్షం