IND vs PAK ICC World Cup : అక్టోబర్ 15న భారత్, పాక్ మ్యాచ్
అహ్మదాబాద్ లో కీలక మ్యాచ్
IND vs PAK ICC World Cup : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇందులో భాగంగా నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇదే సమయంలో దాయాది దేశం పాకిస్తాన్ తో అక్టోబర్ 15న భారత్(IND vs PAK ICC World Cup) తలపడనుంది. ఈ మ్యాచ్ కు కూడా మోదీ మైదానం వేదిక కానుంది. ఇక ఐసీసీ షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి తొలి మ్యాచ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్ నుంచి ప్రారంభం కానుంది. 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో బారత్ ఆడనుంది.
ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇక సూపర్ లీగ్ ద్వారా ఇప్పటి వరకు 8 జట్లు అర్హత సాధించాయి. రెండు జట్లు ఇంకా ఉంటాయా ఉండవా అన్నది తేలాల్సి ఉంది. జూలై 9న జింబాబ్వేలో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది.
ఇక టోర్నీలో భాగంగా ప్రతి జట్టు ఇతర 9 జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో ఆడుతుంది. నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ కు ఆడతాయి. అక్టోబర్ 13న లక్నోలో సౌతాఫ్రికాతో ఆసిస్ తలపడనుంది. మొత్తంగా షెడ్యూల్ ఖరారు కావడంతో బీసీసీఐ ఏర్పాట్లలో మునిగి పోయింది.
మొత్తంగా దాయాదుల మధ్య పోరు అనేది అత్యంత ఉత్కంఠ భరితంగా మారనుంది. తాము పాల్గొన బోమంటూ పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాక పోతే తామేమీ పట్టించుకోమని, పాకిస్తాన్ కే తీవ్ర నష్టం వాటిల్లనుందని స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ సముదాయించడంతో పాక్ ఆడేందుకు ఒప్పుకుంది భారత్ తో.
Also Read : ICC World Cup Final : అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
