IND vs Pak T20 World Cup : పాకిస్తాన్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
చివరి బంతి వరకు ఉత్కంఠ పోరు
IND vs Pak T20 World Cup : టి20 వరల్డ్ కప్ లో నువ్వా నేనా రీతిలో సాగిన కీలక పోరులో భారత జట్టు(IND vs Pak T20 World Cup) అద్బుత విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ సాగింది. భారత స్టార్ ప్లేయర్ , మాజీ భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన రీతిలో ఆడాడు. చివరి వరకు ఉండి టీమిండియాను గెలిపించాడు.
తాను గేమ్ ఛేంజర్ నని నిరూపించాడు. పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఒకానొక దశలో నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన సమయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. జట్టును ఒడ్డుకు చేర్చారు. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన 160 పరుగులు చేసి సత్తా చాటింది. ఏడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత్ చివరకు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బాల్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పాకిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ ను 6 వికెట్లు కోల్పోయింది భారత్ జట్టు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా. ఆఖరు ఓవర్ లో లాస్ట్ బాల్ ను వైడ్ వేశారు. దీంతో ఒక బంతికి మరో పరుగు కావాల్సి వచ్చింది. అంతకు ముందు బంతికి దినేష్ కార్తీక్ పెవిలియన్ చేరాడు. చివరకు మైదానంలోకి వచ్చిన అశ్విన్ పరుగు తీయడంతో గెలుపొందింది.
Also Read : ఐర్లాండ్ పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ