IND vs SA 2nd ODI : లక్నో వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు అనూహ్యంగా కేవలం 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రాణించినా కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్(Sanju Samson) అజేయంగా 86 పరుగులు చేసినా చివరకు పరాజయం పాలైంది.
ఈ తరుణంలో మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా. ఇదిలా ఉండగా ఇవాళ కీలకమైన రెండో వన్డే మ్యాచ్
జరగనుంది. భారత్, సఫారీ జట్లు(IND vs SA ) పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. ఇక ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారనుంది. సిరాజ్,
ఆవేష్ ఖాన్ అంతగా ప్రభావితం చేయలేక పోయారు.
ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు ఉంటారనేది ఉత్కంఠ నెలకొంది. విచిత్రం ఏమిటంటే బీసీసీఐ సంజూ శాంసన్ ను కాకుండా శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించింది. శ్రేయస్ అయ్యర్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది.
దీపక్ చాహర్ గాయం కారణంగా సీరీస్ కు దూరమయ్యాడు. దీంతో జట్టుపై మరింత ఒత్తిడి పెంచుతుంది. ముఖేష్ కుమార్ కు చాన్స్ ఇవ్వవచ్చు. శిఖర్ ధావన్ మొదటి వన్డేలో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్ మన్ గిల్ 7 బంతులు ఆడి 3 రన్స్
చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 42 బంతులు ఆడి 19 పరుగులతో నిరాశ పరిచాడు. అయ్యర్ 37 బంతులు ఆడి 50 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 37 బంతులు ఆడి 20 రన్స్ చేశాడు.
ఇక సంజూ శాంసన్ 63 బంతులు ఆడి 9 ఫోర్లు 3 సిక్సర్లతో దంచి కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 31 బంతులు ఆడి 33 రన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి దాకా తుది జట్టులో ఎవరు ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : భారత్ భళా బంగ్లా విలవిల