IND vs SA 2nd T20 : చెలరేగిన సూర్య భాయ్ తలవంచిన సఫారీ
దక్షిణాఫ్రికాతో టి20 సీరీస్ కైవసం
IND vs SA 2nd T20 : స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టి20(IND vs SA 2nd T20) రెండో మ్యాచ్ లో భారత్ సత్తా చాటింది. ప్రధానంగా అత్యంత ప్రమాదకరంగా తయారైన క్రికెటర్ గా పేరొందిన సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్య దెబ్బకు సఫారీలు కంగారెత్తి పోయారు. ఈ మ్యాచ్ పూర్తిగా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.
మూడు మ్యాచ్ ల సీరీస్ లో 2-0 ఆధిక్యంతో సీరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 237
పరుగులు చేసింది. సౌతాఫ్రికాపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య భాయ్(Surya Kumar Yadav) ఓ వైపు దంచి కొడుతుంటే మైదానంలో చూస్తూ ఉండి పోయాడు కేఎల్ రాహుల్.
ఈ మ్యాచ్ లో కేవలం 22 బంతులు ఎదుర్కొన్న యాదవ్ 61 పరుగులు చేశాడు. ఇదే సమయంలో డేవిడ్ మిల్లర్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా తరపున 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్ని అజేయంగా 106 పరుగులు చేశాడు. ఇక క్వింటన్ డికాక్ 48 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
భారత్ తరపున అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఐడన్ మార్క్రమ్ , క్వింటన్ డికాక్ పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. 33 పరుగుల వద్ద మార్క్రరమ్ ను అవుట్ చేశాడు అక్షర్ పటేల్. అనంతరం బరిలోకి దిగిన డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు.
అశ్విన్ బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ సిక్స్ లు కొట్టాడు. 12వ ఓవర్ లో 19 రన్స్ చేశాడు. భారత బౌలర్లను ఆడుకున్నాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 15 ఓవర్లు ముగిసే సరికి 30 బంతుల్లో 95 రన్స్ చేయాల్సి ఉంది. చివరి దాకా దక్షిణాఫ్రికా పోరాడింది. కానీ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Also Read : శాంసన్ కు షాక్ ధావన్ కు ఛాన్స్