IND vs SA 4th T20I : ఇండియా దక్షిణాఫ్రికా బిగ్ ఫైట్
సఫారీతో నాలుగో టి20 మ్యాచ్
IND vs SA 4th T20I : వైజాగ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో సమిష్టిగా రాణించి సత్తా చాటిన భారత(IND vs SA 4th T20I) జట్టు నాలుగో మ్యాచ్ కు రెడీ అయ్యింది. ఢిల్లీ, కటక్ లలో వరుస విజయాలు సాధించిన పర్యాటక సౌతాఫ్రికా టీం కు వైజాగ్ లో గట్టి దెబ్బ తగిలింది.
ఎలాగైనా సరే సీరీస్ ఎగరేసుకు పోవాలనే లక్ష్యంతో ఆడుతోంది ప్రత్యర్థి జట్టు. ఇక రెండు మ్యాచ్ లలో ఆశించిన స్థాయిలో ఆడలేక పోయింది భారత్. ఇదే సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
ఇక గతంలో విశాఖపట్టణం వేదికగా జరిగిన ప్రతి మ్యాచ్ టీమిండియాకు కలిసొచ్చింది. సఫారీతో మ్యాచ్ లో కూడా సమిష్టి ప్రదర్శనతో రాణించింది. ప్రధానంగా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ రెచ్చి పోయారు.
ఇక బౌలర్లు కట్టుదిట్టగా వేసి సత్తా చాటారు. ప్రధానంగా యుజ్వేంద్ర చాహల్ కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశాడు. కీలక ఆటగాళ్లను పెవిలియన్
బాట పట్టించాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ సమం చేయాలని భావిస్తుండగా భారత్ కు షాక్ ఇచ్చి సీరీస్ చేజిక్కించు కోవాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్ కీలకం కానుంది ఇరు జట్లకు. ఏది ఏమైనా ఆట మాత్రం రసవత్తరంగా మారనుంది.
ప్రధానంగా బ్యాటర్లు రాణిస్తే బౌలర్ల పని సులువవుతుంది భారత జట్టుకు. ఇక సఫారీ జట్టులో విధ్వంసకరమైన ఆటగాళ్లు ఉన్నారు. ఏ మాత్రం కుదురుకున్నా తట్టుకోవడం కష్టం. మ్యాచ్ విషయానికి వస్తే అదే టీం ను కొనసాగించనుంది మేనేజ్ మెంట్.
Also Read : దేశానికి ఆడాలన్న కల నిజమైంది