IND vs SA T20 World Cup : టీమిండియాకు సఫారీల షాక్
5 వికెట్ల తేడాతో ఘన విజయం
IND vs SA T20 World Cup : వరుస విజయాలతో జోరు మీదున్న భారత క్రికెట్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ లో సూపర్-12 లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతిలో భారత్(IND vs SA T20 World Cup) ఓడి పోయింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది సౌతాఫ్రికా.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన కీలక పోరులో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ ను వెనక్కి నెట్టేసింది. సౌతాఫ్రికా నెంబర్ -1లో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ప్రారంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. రోహిత్ శర్మ 15 పరుగులు చేస్తే రాహుల్ మరోసారి 9 పరుగులకే వెనుదిరిగారు. అనంతరం మైదానంలోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 12 రన్స్ చేసి నిరాశ పరిచాడు.
పాకిస్తాన్ , నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 82, 60కి పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. రబాడా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో నిరాశతో వెనుదిరిగాడు ఈ మ్యాచ్ లో. ఇక దీపక్ హూడా సున్నాకే చాప చుట్టేస్తే హార్దిక్ పాండ్యా 2 రన్స్ కే ఔట్ కావడంతో భారత్ ఇక్కట్ల పాలైంది.
ఈ తరుణంలో వికెట్లు ఓ వైపు కోల్పోతున్నా సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఒక్కడే 68 రన్స్ తో పరువు పోకుండా కాపాడాడు. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ 6, అశ్విన్ 7 రన్స్ చేసి నిరాశ పరిచారు. దీంతో 20 ఓవర్లలో 133 రన్స్ కే ఆలౌటైంది.
అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 134 రన్స్ చేసింది. ఆరంభంలో డికాక్ 1, బవుమా 10, రుస్సో 10 పరుగులకే వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కర్రామ్ దుమ్ము రేపాడు. భారత బౌలర్ల భరతం పట్టాడు. 52 పరుగులు చేశాడు. ఇక మిల్లర్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ విజయాన్ని చేకూర్చి పెట్టారు.
Also Read : జింబాబ్వే పోరాటం బంగ్లా విజయం