IND vs SL 1st T20 : భారత్ సిద్దం లంక సన్నద్ధం
తొలి టీ20 మ్యాచ్ కు రెడీ
IND vs SL 1st T20 : కొత్త ఏడాదిలో భారత్ తో శ్రీలంక ఢీకొన బోతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు(IND vs SL 1st T20) టీ20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఆడనుంది. అనంతరం మూడు వన్డేల సీరీస్ కొనసాగుతుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెండు ఫార్మాట్ లకు వేర్వేరుగా జట్లను ప్రకటించింది.
విచిత్రం ఏమిటంటే స్టార్ బ్యాటర్ గా పేరొందిన కేరళ స్టార్ సంజూ శాంసన్ ను కేవలం టీ20 సీరీస్ కు మాత్రమే ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో బీసీసీఐపై నిప్పులు చెరుగుతున్నారు. జనవరి 3న దేశ ఆర్థిక రాజధాని ముంబై లోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
హార్దిక్ పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్ , శ్రేయస్ అయ్యర్ , సూర్య కుమార్ యాదవ్ , శుభ్ మన్ గిల్ కు స్థానం తప్పనిసరిగా ఉంటుందని అంచనా. కానీ తుది జట్టు ప్రకటించే సరికి సంజూ శాంసన్ ను ఉంచుతారా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. బీసీసీఐ పనిగట్టుకుని వివక్ష చూపుతోంది.
ఇది కంటిన్యూగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇక శ్రీలంక పరంగా చూస్తే దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ను శ్రీలంక కైవసం చేసుకుంది. దసున్ షనక సారథ్యంలోని ఆజట్టు పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. ఊహించని రీతిలో మట్టి కరిపించింది. పాకిస్తాన్ ఆటగాళ్ల కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇదే సమయంలో ఆసిస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆశించిన మేర రాణించ లేదు. ఇక శ్రీలంక జట్టులో అవిష్క ఫెర్నాండో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.
Also Read : మా లక్ష్యం వరల్డ్ కప్ గెలవడం – పాండ్యా