IND vs SL 1st T20 : పోరాడిన శ్రీ‌లంక గెలిచిన భార‌త్

2 ప‌రుగుల తేడాతో ఓట‌మి

IND vs SL 1st T20 : కొత్త ఏడాదిలో భార‌త జ‌ట్టు లంకేయుల‌పై ఘ‌న విజ‌యం సాధించి బోణీ కొట్టింది. చిట్ట చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది. చివ‌ర‌కు టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు(IND vs SL 1st T20) మొద‌ట‌గా బ్యాటింగ్ చేసింది. స్టార్ ఆట‌గాళ్లు విఫ‌లం కాగా దీప‌క్ హూడా, అక్ష‌ర్ ప‌టేల్ రాణించ‌డంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది. శివ‌మ్ మావి విజృంభ‌ణ‌తో శ్రీ‌లంక‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో గెలుపు సాధ్య‌మైంది.

ఇక శ్రీ‌లంక జ‌ట్టులో ష‌న‌క , క‌రుణ‌ర‌త్నె ఆఖ‌రి వర‌కు పోరాడినా ఫ‌లితం లేక పోయింది. దీంతో మూడు మ్యాచ్ ల సీరీస్ లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ , విరాట్ కోహ్లీ సీనియ‌ర్లు లేకుండానే టీమిండియా బ‌రిలోకి దిగింది. దీప‌క్ హూడా 23 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 41 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఒక ఫోర్ , నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి. అక్ష‌ర్ ప‌టేల్ 20 బంతులు ఎదుర్కొని 31 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స్ ఉంది.

ఇక శుభ్ మ‌న్ గిల్ , సూర్య కుమార్ యాద‌వ్ 7 ప‌రుగులు మాత్ర‌మే చేస్తే సంజూ శాంస‌న్ 5 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 162 ర‌న్స్ చేసింది.

ఆరో వికెట్ కు 68 ర‌న్స్ చేశారు ఇద్ద‌రు. అనంత‌రం 163 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 160 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. లంక కెప్టెన్ ద‌సున్ ష‌న‌క 45 ర‌న్స్ చేస్తే చ‌మికా క‌రుణ ర‌త్నే 23 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఉమ్రాన్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , శివ‌మ్ మావి రెండు వికెట్ల చొప్పున వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read : సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపికపై క‌స‌ర‌త్తు

Leave A Reply

Your Email Id will not be published!