IND vs SL 2nd T20 : శ్రీ‌లంక‌ భ‌ళా భార‌త్ డీలా

16 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం

IND vs SL 2nd T20 : పుణె వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌ధానంగా భార‌త ఆట‌గాళ్లు మ‌రోసారి ఫెయిల్ అయ్యారు. శ్రీ‌లంక బౌల‌ర్ల ధాటికి కుప్ప కూలారు.

చివ‌రి వ‌ర‌కు పోరాడినా ఫ‌లితం లేక పోయింది. సూర్య కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీతో మెరిస్తే అక్ష‌ర్ ప‌టేల్ ధ‌నా ధ‌న్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో శ్రీ‌లంక(IND vs SL 2nd T20)  16 ర‌న్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

దీంతో ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ గెలిచి స‌మంగా నిలిచాయి. ఇక రాజ్ కోట్ వేదిక‌గా జ‌రిగే మూడో వ‌న్డే మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

ఆ మ్యాచ్ లో ఎవ‌రు గెలిస్తే వారే సీరీస్ కైవ‌సం చేసుకుంటారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ‌రిలోకి దిగిన లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 206 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది.

భార‌త బౌల‌ర్లు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక పోయారు. దీనిని ఆస‌రాగా చేసుకున్న లంకేయులు రెచ్చి పోయారు. ప్ర‌ధానంగా కెప్టెన్ ధనుష ష‌న‌క కేవ‌లం 22 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 56 ర‌న్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. కుషాల్ మెండీస్ 52 ర‌న్స్ చేస్తే అస‌లంక 37 ప‌రుగులతో రాణించారు.

అనంత‌రం 207 ర‌న్స్ టార్గెట్ తో మైదానంలోకి దిగిన టీమిండియా(IND vs SL 2nd T20)  21 ప‌రుగుల‌కే 3 కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న పాండ్యా చేతులెత్తేశాడు. 8 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది.

అక్ష‌ర్ ప‌టేల్ దుమ్ము రేపాడు. 31 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 65 ర‌న్స్ చేశాడు. ఇక సూర్య యాద‌వ్ 31 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స‌ర్లు బాదాడు. 51 ర‌న్స్ చేసినా విజ‌యం ద‌క్క‌లేదు.

Also Read : ఆసియా క‌ప్ షెడ్యూల్ ఖ‌రారు

Leave A Reply

Your Email Id will not be published!