IND vs SL 2nd Test : భారత క్రికెట్ జట్టు ఫుల్ జోష్ మీదుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టు మ్యాచ్(IND vs SL 2nd Test )ను కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. జడ్డూ అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు.
ఇక శ్రీలంక ఓడి పోకుండా కనీసం డ్రా అయినా చేసుకుని పరువు పోకుండా కాపాడు కోవాలని చూస్తోంది. అన్ని ఫార్మాట్ లలో టాప్ పర్ ఫార్మెన్స్ కనబరుస్తున్న రోహిత్ సేన ఇవాళ బెంగళూరు వేదికగా పింక్ బాల్ తో రెండో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
పూర్తిగా నియాన్ లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ జరగనుండడం విశేషం. ఈ మ్యాచ్ కు ప్రత్యేకంగా పూర్తిగా ప్రేక్షకులను చూసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
ఫస్ట్ టెస్టులో ఉన్న ఆటగాళ్లే ఈ టెస్టుకు కొనసాగనున్నాయి. రోహిత్ శర్మతో పాటు మయాంక్ మరోసారి ఓపెనర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. మూడో ప్లేస్ లో విహారి రానున్నాడు. కోహ్లీకి ఈ టెస్టు 101వది. వందో టెస్టులో వంద పరుగులు చేస్తాడని అంతా భావించారు.
కానీ 45 పరుగులకే వెనుదిరిగాడు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, పంత్ ,రవీంద్ర జడేజాలు దుమ్ము రేపుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ సైతం సత్తా చాటగలడు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్, షమీ, బుమ్రా ఆడడం ఖాయం. అక్షర్ పటేల్ , సిరాజ్ ల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి చాన్స్ ఇస్తే ఇంకొకరికి అవకాశం రాదు.
Also Read : ‘డాటిన్’ స్టన్నింగ్ క్యాచ్ సెన్సేషన్