IND vs SL 3rd ODI : భారత్ ప్రతాపం శ్రీలంక పరాజయం
భారీ తేడాతో ఘోర అపజయం
IND vs SL 3rd ODI : వన్డే చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ భారీ తేడాతో మూడో వన్డే మ్యాచ్ లో విజయం సాధించింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రోహిత్ సేన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
శ్రీలంక జట్టుపై అత్యధిక స్కోర్ ఇదే. ఓపెనర్ శుభ్ మన్ గిల్ దుమ్ము రేపితే ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేఎల్ రాహుల్ , సూర్య కుమార్ యాదవ్ , శ్రేయస్ అయ్యర్ నిరాశ పరిచినా కోహ్లీ చివరి దాకా ఉండి భారత్ కు భారీ స్కోర్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఏకంగా 317 పరుగుల తేడాతో శ్రీలంక(IND vs SL 3rd ODI) ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ 166 రన్స్ చేశాడు. ఇందులో 13 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక శుభ్ మన్ గిల్ 116 చేసి తనకు తిరుగే లేదని చాటాడు.
అనంతరం 391 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన శ్రీలంక ఎక్కడా ప్రతిఘటించ లేక పోయింది. హైదరాబాదీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చుక్కలు చూపించాడు లంకేయులకు. ఏకంగా 6 వికెట్లు కూల్చాడు. దీంతో శ్రీలంక కేవలం 75 పరుగులకే చాప చుట్టేసింది. ఈ సీరీస్ లో రెండు సెంచరీలతో రాణించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆప్ ది సీరీస్ కూడా దక్కింది.
Also Read : దంచి కొట్టిన కోహ్లీ చెలరేగిన గిల్