IND vs SL 3rd T20 : భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

91 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

IND vs SL 3rd T20 : హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు టీ20 సీరీస్ 2-1 తేడాతో గెలుచుకుంది. రాజ్ కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో మ్యాచ్ లో దుమ్ము రేపింది. ప్ర‌ధానంగా బ‌రిలోకి దిగిన టీమిండియా(IND vs SL 3rd T20) నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 228 ర‌న్స్ చేసింది. స్టార్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

ఇక శుభ్ మ‌న్ గిల్ 48 ప‌రుగుల‌తో రాణిస్తే , రాహుల్ త్రిఫాఠి 36 ర‌న్స్ చేశాడు. ఆఖ‌రులో అక్ష‌ర్ ప‌టేల్ 21 ర‌న్స్ చేయ‌డంతో భారీ స్కోర్ చేసింది. సూర్య భాయ్ కేవ‌లం 45 బంతులు మాత్ర‌మే ఆడి సెంచ‌రీ చేశాడు. టీ20 ఫార్మాట్ లో మూడో సెంచ‌రీ చేయ‌డం సూర్య కుమార్ యాద‌వ్.

అనంత‌రం 229 ర‌న్స్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక జ‌ట్టు ఆశించిన మేర ఆడ‌లేక పోయింది. దీంతో 91 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది టీమిండియా. ముంబైలో జ‌రిగిన తొలి మ్యాచ్ లో 2 ప‌రుగుల తేడాతో ఇండియా గెలుపొంద‌గా పుణె వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీ‌లంక 16 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

సీరీస్ ను నిర్ణ‌యించే కీల‌క పోరులో భార‌త్ అన్ని విధాలుగా రాణించింది. ఇక లంక బ్యాట‌ర్ల‌లో ష‌నుక 23 ప‌రుగులు చేస్తే , ధ‌నంజ‌య డిసిల్వ 22, అస‌లంక 19 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీస్తే ఉమ్రాన్ మాలిక్ 2, చాహ‌ల్ 2, పాండ్యా 2 , అక్ష‌ర్ టేల్ ఒక వికెట్ తీసుకున్నారు. అంత‌కు ముందు సూర్య భాయ్ 51 బంతుల్లో 7 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో 112 ర‌న్స్ చేశాడు.

Also Read : స‌ర్ఫ‌రాజ్ శ‌త‌కం భార్య భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!