IND vs SL Asia Cup 2022 : అబ్బా లంకేయుల దెబ్బ
అద్భుతం జరిగితే తప్పా ఫైనల్ కు కష్టం
IND vs SL Asia Cup 2022 : ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ -2022లో భారత జట్టు దాదాపు ముగిసినట్టే. సూపర్ -4లో పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైన భారత్ అదే సీన్ ను కంటిన్యూ చేసింది. శ్రీలంకతో(IND vs SL Asia Cup 2022) జరిగిన కీలక పోరులో చేతులెత్తేసింది.
చివరకు ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. ఫైనల్ కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఒత్తిడికి లోనైంది. ఆడుతున్నది భారత జట్టేనా అన్న అనుమానం కలిగింది.
కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పర్వాలేదనిపిస్తే మిగతా ఆటగాళ్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. భువనేశ్వర్ కుమార్ ధారాలంగా
పరుగులు సమర్పించుకుంటే అర్ష్ దీప్ ఎప్పటి లాగే పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన ఇబ్బంది పెట్టింది.
గురువారం ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది భారత జట్టు. ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందుకు సంబంధించి
ఆసియా కప్ ను రిహార్సల్ గా తీసుకోవాలని అనుకుంది టీమిండియా.
కానీ అది కూడా ఫెయిల్ అయ్యింది. అసలు జట్టు ఎంపికలోనే ఏదో లోపం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. భారత్ గనుక ఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది భారత్. నిర్ణీత 20
ఓవర్లలో 8 వికెట్లు కోల్ఓయి 173 రన్స్ చేసింది.
కోహ్లి సున్నాకే వెనుదిరిగితే మరోసారి కేఎల్ రాహుల్ నిరాశ పరిచాడు. రోహిత్ శర్మ 72 , సూర్య కుమార్ యాదవ్ 34 రన్స్ తో ఆకట్టుకున్నారు. పాండ్యా 17, పంత్ 17 , హూడా 3 పరుగులు మాత్రమే చేశారు.
లంక బౌలర్లలో మధుషనక 3, చమిక, దుసున్ షనక చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు.
19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 రన్స్ చేసింది. ఓపెనర్లు నిసాంక 52, కుషాల్ మెండీస్ 57 రన్స్ తో రాణించారు. చివర్లో వచ్చిన కెప్టెన్ షనక 33
రన్స్ చేస్తే రాజపక్స 25 పరుగులతో దంచి కొట్టారు.
తమ జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టారు. భారత బౌలర్లలో చహల్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేక పోయారు.
Also Read : అర్ష్ దీప్ సింగ్ దేశానికి గర్వకారణం