IND vs SL Asia Cup 2022 : శ్రీలంక జోరు భారత్ హుషారు
ఆసియా కప్ సూపర్ - 4 లో కీలక మ్యాచ్
IND vs SL Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ సూపర్ -4లో భాగంగా కీలకమైన మ్యాచ్ జరగనుంది భారత్, శ్రీలంక(IND vs SL Asia Cup 2022) జట్ల మధ్య. ప్రస్తుతం నాలుగు జట్లు అర్హత పొందాయి.
శ్రీలంక ఆఫ్గనిస్తాన్ ను ఓడించి ఫుల్ జోష్ మీదుంది. ఇదే సమయంలో పాకిస్తాన్ లీగ్ మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్ పై. ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
ఆసియా కప్ లో హాట్ ఫెవరేట్ గా భారత్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. కానీ ఇదే సమయంలో శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ జట్లను తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు.
గత కొంత కాలంగా పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లోకి రావడం శుభ పరిణామం.
ఇక కీలక సమయంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా చేతులెత్తేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయినా కెప్టెన్ అన్నాక కాస్తంత ఓపిక ఉండాలి. దానిని కంట్రోల్ చేసుకోలేక పోతే ఇక నాయకుడిగా సక్సెస్ కాలేడు. ఎవరు ఉంటారు ఎవరు ఉండరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆల్ రౌండర్ పరంగా పాండ్యా అవసరం. ఇక మూడు మ్యాచ్ లలో చాహల్ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత్ కు కీలకం.
తప్పనిసరిగా గెలిస్తేనే నిలుస్తుంది టీమిండియా. దినేశ్ కార్తీక్ ను ఉంచుతారా అనేది కూడా అనుమానంగా ఉంది. రోహిత్, కేఎల్ రాహుల్ ప్రదర్శన ఏమంత బాగా లేదు. అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ , అర్ష్ దీప్ సింగ్ , రవి బిష్ణోయ్ ఉండే అవకాశం ఉంది.
Also Read : అర్ష్ దీప్ పై ట్వీట్..జుబైర్ పై ఫిర్యాదు