IND vs WI 2023 Schedule : జూలై 12 నుంచి విండీస్ టూర్
షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
IND vs WI 2023 Schedule : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెస్టిండీస్ లో పర్యటించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసింది(IND vs WI 2023 Schedule). రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ లోని ఓవెల్ లో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ను కోల్పోయింది. ఆసిస్ చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. దీంతో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ని విశ్రాంతి పేరుతో పక్కన పెట్టనుంది బీసీసీఐ.
ఇదే సమయంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటోంది. వీరిలో ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ ఆడనున్నారు. కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో వికెట్ కీపర్ గా ఇద్దరూ పనికొస్తారని భావిస్తోంది బీసీసీఐ(BCCI).
టెస్టు జట్టుకు అజింక్యా రహానే నాయకత్వం వహించనుండగా వన్డే, టి20 కి హార్దిక్ పాండ్యాను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక భారత జట్టు వచ్చే జూలైలో వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
1వ టెస్టు మ్యాచ్ జూలై 12 నుంచి 16 వరకు డొమినికాలోని విండర్స్ పార్కులో జరుగుతుంది. 2వ టెస్టు మ్యాచ్ జూలై 20 నుంచి 24 వరకు ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ లో కొనసాగనుంది. ఇక వన్డేల విషయానికొస్తే జూలై 27న బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో , 2వ వన్డే మ్యాచ్ జూలై 29న బార్బడోస్ లో , 3వ వన్డే మ్యాచ్ ఆగస్టు 3న ట్రినిడాడ్ లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియంలో జరగనుంది.
ఇక టీ20 మ్యాచ్ ల విషయానికొస్తే 1వ టీ20 మ్యాచ్ ట్రినిడాడ్ లో జరగనుండగా 2వ టీ20 మ్యాచ్ ఆగస్టు 6న గయానా లోని నేషనల్ స్టేడియంలో , 3వ టీ20 మ్యాచ్ ఆగస్టు 8న గయానాలో, 4వ టీ20 మ్యాచ్ ఫ్లోరిడా లోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో , 5వ టీ20 మ్యాచ్ లాడర్ హిల్ లో జరగనుంది.
Also Read : Sanju Samson Return : సంజూ శాంసన్ పునరాగమనం
