IND vs WI 2nd T20 : ఇప్పటికే 3-0తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సీరీస్ సైతం స్వంతం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో ఆధిక్యంలో ఉంది. కోల్ కతా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన 2వ టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
భారత్ ఎట్టకేలకు 8 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసింది. టార్గెట్ ఛేదనలో విజయానికి 25 పరుగులు కావాల్సి ఉండగా
వెస్టిండీస్ ఆఖరులో చేతులెత్తేసింది. హర్షల్ పటేల్ అద్భుత బౌలింగ్ కు విండీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేక పోయారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రిషబ్ పంత్ , విరాట్ కోహ్లీ (IND vs WI 2nd T20)రాణించడంతో గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది.
విచిత్రం ఏమిటంటే టీమిండియాకు ఈ టీ20 మ్యాచ్ గెలుపుతో 100వ విక్టరీ.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
పంత్ 28 బంతులు ఆడి 7 ఫోర్లు ఓ సిక్స్ తో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇక కోహ్లీ 41 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్స్ తో 52 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 18 బంతులు ఆడి 33 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఓ సిక్స్ ఉంది.
అనంతరం బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
పావెల్ దుమ్ము రేపాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
నికోలస్ పూరన్ 41 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స్ లతో 62 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 100 పరుగులు చేసినా జట్టును గెలిపించ లేక పోయారు.
Also Read : సౌరాష్ట్రపై రహానే సెంచరీ