IND vs WI 3rd ODI : రోహిత్ శర్మ కెప్టెన్ గా కొలువు తీరాక స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సీరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించి జోరు మీదుంది భారత జట్టు. ఇక మూడో వన్డే కూడా గెలిచి సత్తా చాటాలని డిసైడ్ అయ్యింది.
ఇప్పటికే సఫారీ టూర్ సందర్భంగా మూడు వన్డేలతో పాటు 2 టెస్టుల్లో ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టుపై (IND vs WI 3rd ODI)తీవ్ర విమర్శలు వచ్చాయి.
ప్రధానంగా బీసీసీఐ చీఫ్ గంగూలీ, భారత సెలక్షన్ కమిటీ జట్టు ఎంపిక తీరుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం మండిపడ్డారు.
అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో పూర్తి స్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఎవరూ ఊహించని విధంగా రిషబ్ పంత్ ను ఓపెనర్ గా ట్రై చేశారు.
జట్టు కుదుట పడేంత వరకు రాబోయే వరల్డ్ కప్ కోసం ప్రయోగాలు చేయక తప్పదని తెలిపారు.
ఇప్పటికే సీరీస్ గెలిచినా ఈ మ్యాచ్ కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది టీమిండియా.
జట్టు పరంగా చూస్తే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సైతం దుమ్ము రేపుతోంది.
మరో వైపు పోయిన పరువు పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలవాలని అనుకుంటోంది వెస్టిండీస్(IND vs WI 3rd ODI).
ఇవాళ జరిగే మ్యాచ్ లో మాత్రం భారత్ హాట్ ఫెవరేట్ గా దిగుతోంది.
కరోనా కారణంగా ఆటకు దూరమైన శిఖర్ ధావన్ ను తీసుకుంటామని ఇప్పటికే చెప్పాడు రోహిత్ శర్మ.
ప్రధానంగా విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్ లలో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో నైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.
Also Read : రవిశాస్త్రిపై రహానే కామెంట్స్