IND vs WI 4th T20 : ఓపెన‌ర్స్ అదుర్స్ భార‌త్ సూప‌ర్

విండీస్ తో టి20 సీరీస్ స‌మం

IND vs WI 4th T20 : విండీస్ టూర్ లో భాగంగా జ‌రిగిన టి20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఆతిథ్య జ‌ట్టు వెస్టిండీస్ ను మ‌ట్టి క‌రిపించింది. 5 మ్యాచ్ ల‌లో భాగంగా ప్ర‌స్తుతం ఇరు జ‌ట్లు 2 మ్యాచ్ ల చొప్పున గెలుపొంది సీరీస్ స‌మం చేశాయి.

IND vs WI 4th T20 Match Updates

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే వెస్టిండీస్ జ‌ట్టు స్కిప్ప‌ర్ టాస్ గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 178 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా ఆడింది. ప్ర‌ధానంగా ఐపీఎల్ టోర్నీ నుంచి శుభ్ మ‌న్ గిల్ , య‌శ‌స్వి జైస్వాల్ దంచి కొట్టారు. దీంతో సుల‌భ‌వంగా గెలుపొందింది టీమిండియా.

విండీస్ జ‌ట్టులో సిమ్రోన్ హిట్ మైర్ దంచి కొట్టాడు. 61 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 61 ర‌న్స్ చేశాడు. షై హోప్ 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 45 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ లో కీల‌క పాత్ర పోషించారు ఇద్ద‌రూ. అర్ష్ దీప్ 3, కుల్దీప్ యాద‌వ్ 2 వికెట్లు తీశారు. చాహ‌ల్ ఆశించిన మేర రాణించ లేదు.

అనంత‌రం భార‌త జ‌ట్టు కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయింది. 179 ర‌న్స్ చేసింది. జైస్వాల్ 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో దంచి కొట్టాడు. 84 ర‌న్స్ చేశాడు. నాటౌట్ గా మిగిలాడు. గిల్ 47 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 77 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆక‌ట్టుకుని జ‌ట్టును గెలిపించిన జైస్వాల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు ద‌క్కింది.

Also Read : MK Stalin : హాకీ జ‌ట్టుకు స్టాలిన్ న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!