IND vs Wi 1st T20 : చెలరేగిన భారత్ తలవంచిన వెస్టిండీస్
68 పరుగుల తేడాతో ఘన విజయం
IND vs Wi 1st T20 : విండీస్ టూర్ లో ఉన్న టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు వన్డే సీరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
తాజాగా గాయం కారణంగా ఆటకు దూరమై రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు(IND vs Wi) టి20 సీరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో సత్తా చాటింది.
ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. 68 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతులు ఆడి 64 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ 24 రన్స్ చేస్తే శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. కేవలం 14 పరుగులు చేయగా ఆడతాడని అనుకున్న హార్దిక్ పాండ్యా కేవలం 1 పరుగు మాత్రమే చేసి చేతులెత్తేశాడు.
జడేజా 16 పరుగులు చేస్తే ఆఖరిలో వచ్చిన దినేశ్ కార్తీక్ దుమ్ము రేపాడు. 19 బంతులు ఆడి 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
అనంతరం బరిలోకి దిగిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్ దీప్ , రవిచంద్రన్ అశ్విన్ , బిష్నోయ్ చెరో 2 వికెట్లు తీశారు. ఇదిలా ఉండగా రెండో టీ20 మ్యాచ్ సోమవారం జరగనుంది.
Also Read : టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్