IND vs WI 2nd ODI : విండీస్ పై విజయం సీరీస్ కైవసం
చరిత్ర సృష్టించిన టీమిండియా
IND vs WI 2nd ODI : శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సీరీస్ ను 2-0 తేడాతో
కైవసం చేసుకుంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో ఉత్కంఠ భరిత గెలుపు నమోదు చేసిన టీమిండియా అదే జోరు రెండో
వన్డే లోనూ కొనసాగిస్తోంది.
2 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠను రేపింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఆఖరి ఓవర్ లో
భారత జట్టు 8 పరుగులు చేయాల్సి ఉంది.
తొలి మూడు బాల్స్ లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇంకా మూడు బంతులలో 6 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఇక నాలుగో బంతికి ఊహించని రీతిలో అక్షర్ పటేల్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. దీంతో విజయం భారత్ వశమైంది. తొలి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ , సంజూ శాంసన్ హీరోలుగా నిలిస్తే ఈసారి పటేల్ కీలక పాత్ర పోషించాడు.
ఇదే సమయంలో భారత్(IND vs WI 2nd ODI) కొత్త చరిత్ర నమోదు చేసింది. అదేమిటంటే ఒకే టీమ్ పై అత్యధిక వన్డే సీరీస్ లు గెలుపొందిన
జట్టుగా రికార్డు సృష్టించింది. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 311 రన్స్ చేసింది. విండీస్ బ్యాటర్ షై హూప్ చెలరేగి ఆడాడు. 115 పరుగులు చేశాడు. అనంతరం
బరిలోకి దిగిన భారత జట్టు 49.4 ఓవర్లలో 312 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ 63 పరుగులు చేసి రాణిస్తే , అక్షర్ పటేల్ 64 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇక కేరళ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ 54
పరుగులతో కీలక పాత్ర పోషించాడు.
Also Read : 100 టెస్టులు పూర్తి చేసిన మాథ్యూస్