IND vs ZIM 2nd ODI : రెండో వన్డే లోనూ భారత్ దే హవా
సత్తా చాటిన సంజూ శాంసన్
IND vs ZIM 2nd ODI : జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత జట్టు సత్తా చాటింది. మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి వన్డే లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
హరారే వేదికగా శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్(IND vs ZIM 2nd ODI) లోనూ సత్తా చాటింది. దీంతో 2-0 తేడాతో వన్డే సీరీస్ చేజిక్కించుకుంది. టీమిండియా సీరీస్ సాధించి చరిత్ర సృష్టించింది.
ఇంకా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సీరీస్ కైవసం చేసుకోవడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే జట్టు 161 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచింది.
అనంతరం 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది టీమిండియా. కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను కేవలం 25.4 ఓవర్లలోనే చేదించింది. తనకు ఎదురే లేదని చాటింది.
భారత బ్యాటర్లలో కేరళ స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ గా పేరొందిన సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. శాంసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
శిఖర్ ధావన్ 33 రన్స్ చేస్తే గిల్ 33 పరుగులతో రాణించారు. ఇదిలా ఉండగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశ పరిచాడు.
జింబాబ్వే బౌలర్లలో జాంగ్వే రెండు వికెట్లు తీస్తే రజా, న్యాచీ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు జింబాబ్వే 161 పరుగులకే చాప చుట్టేసింది. 38.1 ఓవర్లలో క్లోజ్ చేసింది.
జట్టు ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ 42 పరుగులతో టాప్ లో నిలిచాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, సిరాజ్, కుల్దీప్ యాదవ్ , హుడా, ప్రసిద్ద్ కృష్ణా చెరో వికెట్ తీశారు.
Also Read : రిటైర్ కానున్న ఝులన్ గోస్వామి