NV Ramana : స్వ‌తంత్ర జ‌ర్న‌లిజం ప్రజాస్వామ్యానికి ప్రాణం

స్ప‌ష్టం చేసిన సీజేఐ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ

NV Ramana : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌లపాటి వెంక‌ట ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. స్వ‌తంత్ర (ఇండిపెండెంట్ ) జ‌ర్న‌లిజం అనేది ప్ర‌జాస్వామ్యానికి వెన్నెముక అని అన్నారు.

మంగ‌ళ‌వారం ఆధునిక జ‌ర్న‌లిజం..విస్త‌రిస్తున్న స‌మాజం దానిపై ప్ర‌భావం అనే అంశంపై సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌ర్న‌లిస్టులు (పాత్రికేయులు) ప్ర‌జ‌ల‌కు క‌ళ్లు, చెవులు లాంటి వార‌ని కొనియాడారు.

ప్ర‌ధానంగా భార‌తీయ సామాజిక ధృక్కోణంలో చూస్తే వాస్తవాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం మీడియా సంస్థ‌ల ప్ర‌ధాన బాధ్య‌త అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్నాల‌జీలో పెను మార్పులు చోటు చేసుకున్నా ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ఈ దేశంలో ముద్రించిన వార్త‌లు , ప్ర‌త్యేక క‌థ‌నాలు నిజ‌మ‌ని, వాస్త‌వ‌మ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

ఏ వ్య‌వ‌స్థ‌ల‌కైనా మీడియా (ప్రచుర‌ణ‌, ప్ర‌సార‌, సోష‌ల్ ) అన్న‌ది ముఖ్య‌మ‌న్నారు. కానీ దానికి కూడా సామాజిక బాధ్య‌త ఉంద‌ని మ‌రిచి పోకూడ‌ద‌ని సూచించారు. అయితే స్వీయ నియంత్ర‌ణ ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి కావాల‌ని స్ప‌ష్టం చేశారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌.

ఇటీవ‌ల రాంచీలో జ‌రిగిన స‌మావేశంలో సోష‌ల్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఏపీ రాష్ట్రానికి సీజేఐ ఒక‌ప్పుడు జ‌ర్న‌లిస్ట్ గా త‌న జీవితాన్ని ప్రారంభించారు. అనంత‌రం లాయ‌ర్ గా, న్యాయ‌వాదిగా అంచెలంచెలుగా ఎదిగారు.

ఓ మారుమూల గ్రామానికి చెందిన పేద రైతు కుటుంబం నుంచి వ‌చ్చారు జస్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ‌(NV Ramana).

Also Read : అరెస్ట్ శిక్షార్హ‌మైన సాధ‌నం కాదు – సుప్రీం కోర్టు

Leave A Reply

Your Email Id will not be published!