Independent Media Houses : స్వతంత్ర మీడియా సంస్థల హవా
డిజిటల్ మీడియాలో హల్ చల్
Independent Media Houses : కాలం మారుతోంది. టెక్నాలజీ విస్తరిస్తోంది. సమాచారం ఇప్పుడు శరవేగంగా అందుతోంది. కానీ వాస్తవాలు ఏవీ జనానికి చేరడం లేదు. ప్రింట్ , మీడియా తర్వాతి స్థానం డిజిటల్ మీడియా డామినేట్ చేస్తోంది. ఈ తరుణంలో భారత దేశంలో లెక్కకు మించి న్యూస్ పోర్టల్స్ , యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రం వాస్తవాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.
వాటిలో చెప్పుకోవాల్సినవి చాలానే ఉన్నా కొన్ని జనాదరణను పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఆన్ లైన్ డిజిటల్ మీడియా వినియోగం భారత దేశంలో గణనీయమైన మార్పును చూపిందని చెప్పక తప్పదు. సంప్రదాయ మీడియా సంస్థలకు సవాళ్లను విసురుతోంది. డిజిటల్ ఇండియా ఉద్యమం , దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తరణ కంటెంట్ వినియోగాన్ని మరింత సులభతరం చేసింది.
మొబైల్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లలో వార్తలు, సమాచారం సంప్రదాయ ప్రాధాన్యత వనరులను అధిగమించేలా చేశాయి. కథనాలకు సంబంధించిన వినూత్న విధానాలు ఈ ట్రెండ్ కు మద్దతు ఇస్తున్నాయి. ఇక స్వతంత్ర మీడియా సంస్థల్లో(Independent Media Houses) స్క్రోల్ టాప్ లో కొనసాగుతోంది. ఇది భారతీయ డిజిటల్ న్యూస్ మీడియా. యుఎస్ లోని డెలావర్ లో విలీనం చేశారు.
ఆన్ లైన్ న్యూస్ లెటర్ , మొబైల్ అప్లికేషన్ , యూట్యూబ్ , ఇన్ స్టా , ట్విట్టర్ ద్వారా కంటెంట్ ను ప్రచురిస్తుంది. 2014లో నరేష్ ఫెర్నాండేజ్ , జెన్నిఫర్ ఓబ్రియన్ లు స్థాపించారు. రామ్ నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ అవార్డుతో పాటు సీపీజే ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం అందుకుంది.
రెండోది ది ప్రింట్. ఇది భారతీయ ఆన్ లైన్ డిజిటల్ వార్తా పత్రిక. దీనికి ప్రింట్ లైన్ మీడియా మద్దతు ఇస్తోంది. శేఖర్ గుప్తా 2016లో దీనిని స్థాపించారు. ఢిల్లీలో ఉంది. మీడియా రాజకీయాలు, విధానాలపై ఫోకస్ పెడుతుంది ఎక్కువగా. మూడోది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఒకటి ఉంది.
అదే ది లాజికల్ ఇండియన్ . ఇది ఆన్ లైన్ డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్. రాజకీయ, విధాన పరమైన సమస్యలను అందిస్తుంది. ప్రజా స్పూర్తితో కూడిన వేదిక. బెంగళూరు ప్రధాన కార్యాలయం. అభిషేక్ మజుందార్ , అనురాగ్ మజుందార్ స్థాపించారు. సమకాలనీ సమస్యలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఇక డిజిటల్ మీడియాలో చెప్పుకోవాల్సింది ద్వి క్వింట్ .
పలు అవార్డులను పొందింది. రాఘవ్ బాల్ , రీతూ కపూర్ 2014లో స్థాపించారు. వెబ్ సైట్ , ఇన్ స్టా , ట్విట్టర్ , యూట్యూబ్ ద్వారా పని చేస్తుంది. ది క్వింట్ వెబ్ క్యూఫ్ ను కూడా నిర్వహిస్తుంది. వివరణాత్మక జర్నలిజానికి , ప్రత్యేకమైన సంపాదకీయ కంటెంట్ పై ఫోకస్ పెడుతుంది. సిద్దార్థ్ కొఠారి దీనిని స్థాపించారు.
డిజిటల్ మీడియాలో సంచలనం ది వైర్. సమకాలీన అంశాలను ప్రస్తావిస్తుంది. ఎక్కువగా వాస్తవాలను ప్రతిబింబించేలా కథనాలు ప్రచురిస్తుంది. దీనిపై కేంద్ర సర్కార్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సంపాదకులను అరెస్ట్ చేసే దాకా వెళ్లింది.
Also Read : టాప్ 10 మీడియా హౌస్ లు ఇవే